సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు - ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి

Milan Fernandez Died: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది సీనియర్ నటులు, ప్రముఖ టెక్నీషియన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరో సీనియర్ టెక్నీషియన్ ను కూడా సినీ ఇండస్ట్రీ కోల్పోయింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మిలన్ ఫెర్నాండెజ్ మృతి చెందారు. ఈ మధ్యకాలంలో చాలా మంది గుండె పోటుతో చనిపోతున్నారు. చిన్న వయస్సు వారి నుంచి ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే, రోజూ వ్యాయామం చేసే వారిని కూడా గుండె పోటు కబళిస్తోంది. తాజాగా మిలన్ ఫెర్నాండెజ్ కూడా గుండెపోటుతోనే మరణించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది.

చాలా ఏళ్లుగా ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు పని చేశారు. ప్రస్తుతం తమిళ ప్రముఖ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న విడా ముయూర్చి చిత్రానికి కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. అజిత్ కుమార్ హీరోగా, మగిజ్ తిరుమనేని దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. త్రిష, రెజీనా హీరోయిన్లుగా, సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్‌బైజాన్ లో జరుగుతోంది.

Bollywood Art Director Milan Fernandez Died With heart Attacks

చిత్ర యూనిట్ తో కలిసి అజర్‌బైజాన్ లో విడా మయుర్చి షూటింగ్ సమయంలో ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మిలాన్ ఫెర్నాండెజ్ గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. విడా ముయూర్చి చిత్రాన్ని నిర్మిస్తున్న కోలీవుడ్ ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. మిలాన్ మరణ వార్తను మొదట ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్త అధికారికంగా బయటకు వచ్చింది.

ముందు రోజు శనివారం రాత్రి సినిమా షూటింగ్ తర్వాత హోటల్ కు చేరుకున్న మిలాన్ ఎప్పట్లాగే సాధారణంగానే ఉన్నారు. ఉదయం తన టీమ్ ని పిలిచి మాట్లాడుతున్న సమయంలోనే ఆయనకు ఛాతిలో నొప్పితో, ఒంటి నిండా చెమటతో, చాలా ఇబ్బంది పడుతూ పక్కకు ఒరిగారు. వెంటనే స్పందించిన తన టీమ్.. హోటల్ సిబ్బందిని పిలిచి విషయం చెప్పి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు తెలిపారు. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ ఫెర్నాండెజ్ హఠాన్మరణం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు మిలాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Bollywood Art Director Milan Fernandez Died With heart Attacks

ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్ లో ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న మిలాన్.. ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలకు పని చేశారు. ఆర్ట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువ శాతం తమిళ సినిమాలకే పని చేశారు మిలాన్. 2006లో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత బిల్లా, వేదాళం, వేలాయుదం, వీరమ్ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. రజినీ కాంత్ నటించిన అన్నాత్త వంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. చివరిగా శింబు హీరోగా నటించిన పాతు తలా చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. కేవలం సినిమాలకే కాకుండా ఎన్నో యాడ్స్ కు కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. మిలాన్ తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క తెలుగు సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా చేశారు. అదే గోపీచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్. ఈ మూవీ కమర్షియల్ గా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆ తర్వాత మిలాన్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X