బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమ.. బయటకు రాగానే నిశ్చితార్థం..త్వరలో పెళ్లనగా బ్రేకప్.. ఈ బుల్లితెర జంట గురించి తెలుసా?

తమపై వస్తున్న పుకార్లను నిజం చేసింది ఈ బిగ్‌బాస్ జోడీ, బుల్లితెర జంట. ఆ జంట అలానట అంటూ చాలా కాలంగా వస్తున్న రూమర్స్ ను పట్టించుకోని ఈ బ్యూటీఫుల్ జోడీ.. ఆఖరికి వాటినే వార్తల్లో హెడ్‌లైన్స్‌గా మార్చింది. బాలీవుడ్ రొమాంటిక్ పెయిర్.. పవిత్ర పూనియా - ఇజాజ్ ఖాన్ విడిపోయారంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలా కాలంగా ఈ రూమర్స్ పై ఈ జంట నోరు విప్పలేదు. తాజాగా పవిత్ర పూనియా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమపై సోషల్ మీడియాలో చాలా కాలంగా కొన్ని పుకార్లు వస్తున్నాయని, అయితే ఈ పుకార్లన్నీ నిజమేనని పవిత్ర పూనియా కుండబద్దలు కొట్టింది.

ఆ బ్రేకప్ వార్తలు పూర్తి వాస్తవమేనని ధ్రువీకరించింది. ఈ విషయం గురించి మాట్లాడుతూనే సోషల్ మీడియా యూజర్లకు, తమ ఫ్యాన్స్ కు ఓ విజ్ఞప్తి కూడా చేసింది పవిత్ర పూనియా. 'సోషల్ మీడియా యూజర్లకు, నా ఫ్యాన్స్ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. దయ చేసి మా బ్రేకప్ రూమర్స్ గురించి ఎవరూ మాట్లాడకండి. మా ఇద్దరి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించ వద్దు. నన్ను(పవిత్ర పూనియా), అలాగే ఇజాజ్ ఖాన్ ను ఇద్దరినీ సపోర్ట్ చేయాలని కోరుతున్నా. మా ఇద్దరి మధ్య ఏది అయితే జరిగింందో అది బహుశా ఒక కారణం వల్లే జరిగి ఉంటుందని భావిస్తున్నా.

Bollywood Beauty Pavitra Punia Break up to Ejaz Khan Check Details

నేను ఎప్పుడూ నెటిజన్లకు, ఫ్యాన్స్ కు టచ్‌లోనే ఉంటాను. ఇజాజ్ ఖాన్ తో బ్రేకప్ తర్వాత ఇప్పుడు నేను పూర్తిగా నా కెరీర్ పైనే ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాను. ఈ మధ్యే నా తండ్రిని కోల్పోయాను. నాకు ఓ అన్నయ్య ఉన్నాడు. అతడు నన్ను తల్లిలా చూసుకుంటే, నేను నా అన్నయ్యను చిన్న పిల్లాడిలా చూసుకుంటాను.

Bollywood Beauty Pavitra Punia Break up to Ejaz Khan Check Details

ఈ సమయంలో నా అవసరం నా కుటుంబానికి చాలా చాలా ఉంది. నేను నా కోసం, నా కుటుంబం కోసం కొన్ని పనులు చేస్తున్నాను, ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇదంతా మీరు పెద్ద మనసుతో, ప్రేమతో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇలాంటి సమయంలో నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను. నా కుటుంబ సభ్యుల బాధ్యతలు నేను నా భుజానికెత్తుకున్నాను. అలాగే ఇజాజ్ ఖాన్ తో బ్రేకప్ తర్వాత, ఇప్పుడు నా కుటుంబం ఉన్న పరిస్థితిలో నాకు పెళ్లి ఆలోచనలు లేవు. ఇప్పటిలో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు' అని పవిత్ర పూనియా బ్రేకప్ నిజమేనని ధ్రువీకరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X