Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 లుక్ లీక్.. చేసిందెవరో కాదు ఆ హీరోయినే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ కు కూడా ఈ యంగ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా వార్ 2 సినిమాతోనే. అయితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ లీక్ అయింది. అయితే ఓ బాలీవుడ్ హీరోయినే నేరుగా ఎన్టీఆర్ లుక్ ను రివీల్ చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్.. హిట్ల మీద హిట్లు కొడుతూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. భారీ బడ్జెట్ తో.. ప్రస్తుతం తెలుగులో దేవర చిత్రంలో నటిస్తున్న ఈయన బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' అనే సినిమాలో నటించబోతున్నారు.

గతంలో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబోతున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు జాన్ అబ్రహం, కియారా అడ్వాణీ, షబ్బిర్ అహ్లువాలియాలు ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. ఇప్పటికే రెగ్యులర్ ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ లుక్ లీక్ అయింది.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ ఫొటో దిగింది. దాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అయితే అందులో ఈ బాలీవుడ్ బ్యూటీతో పాటు హీరో కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోలో యంగ్ టైగర్ చాలా స్మార్ట్ గా, కుర్రాడిలా కనిపిస్తుండగా.. ఇది వార్ 2 చిత్రం లుక్ యేనని తెలుస్తోంది. కేవలం ఫొటో మాత్రమే షేర్ చేయకుండా.. రౌతేలా ఓ పెద్ద విషయమే వివరించింది.
ముక్స్ వేదికగా.. గ్లోబల్ స్టార్ తారక్ అందరితో చాలా బాగుంటారని, వినయంతో పాటు నిజాయితీగా ఉంటారని చెప్పుకొచ్చింది. ఆయన వ్యక్తిక్తం నిజంగా ప్రశంసనీయమంటూ ప్రశంసల వర్షం కురిపించింది. అంతేకాకుండా త్వరోలనే మీతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ వివరించింది. ఆ పోస్ట్ చూసిన ప్రతీ ఒక్కరూ వార్ 2లో వీరిద్దరూ కలిపి పని చేయబోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే వారిద్దరూ కలిసి ఈ ఫొటో దిగారని.. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ చాలా యంగ్ గా కనిపించున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











