twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోడ్డున పడిన మరో యాక్టర్.. ఒకప్పుడు అమీర్ ఖాన్ ఫ్రెండుగా.. ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటూ..

    |

    సినిమా ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నా ఎక్కువ కాలం పని దొరకుతుందన్న గ్యారెంటి లేదు. కొన్నిసార్లు అవకాశాలు తగ్గిపోతుంటాయి. రాజభోగాలు అనుభవించిన ఎంతో మంది స్టార్స్ పాతాళానికి పడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రతి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇంకా ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. ఇక కరోనా దెబ్బకు షూటింగ్స్ తగ్గిపోవడంతో మరో నటుడికి కూడా రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.

    Recommended Video

    Groceries Distribution To Telugu Cine Still Photographers Association
     కరోనా దెబ్బ..

    కరోనా దెబ్బ..

    కరోనా వైరస్ కారణంగా సాధారణ జనాలతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి జీవితాలు కూడా ఊహించని మలుపులు తిరిగాయి. లాక్ డౌన్ నుంచే షూటింగ్స్ లేకపోవడంతో పేద కళాకారులకు రోజు గడవడమే కష్టంగా మారింది. సినీ పెద్దలు ఎంత సహాయం అందిస్తున్నప్పటికి ఎక్కువ రోజులు ఉపయోగపడటం లేదు.

    కూరగాయలు అమ్ముకుంటున్న నటుడు..

    కూరగాయలు అమ్ముకుంటున్న నటుడు..

    ఇక ఇటీవల మరొక బాలీవుడ్ నటుడి జీవితం కూడా రోడ్డున పడింది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒకప్పుడు అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోతో నటించిన ఆ యాక్టర్ ఇప్పుడు ఈ విధంగా రోడ్డు మీద పడటం అందరిని షాక్ కి గురి చేస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ డాలీ బింద్రా కూడా ఆ వీడియోను షేర్ చేశారు.

    రేపటి ఆకలి కోసం..

    రేపటి ఆకలి కోసం..

    అమీర్ ఖాన్ గులామ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ జావేద్ ఆ తరువాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సీరియల్స్ తో బిజీగా మారాడు. ఇన్నాళ్లు షూటింగ్స్ లేకపోవడంతో దాచుకున్న డబ్బు కూడా అయిపోయిందని రేపటి ఆకలి కోసం ఇలా చేయక తప్పడం లేదని ఆ నటుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

    పండ్లు అమ్ముకున్న మరో నటుడు..

    జావేద్ లాంటి కథలు ఇటీవల కాలంలో చాలానే బయటపడ్డాయి. ఇక కొందరు బయటపడకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ మధ్య బాలీవుడ్ కి చెందిన ఒక నటుడు రోడ్డు మీద పండ్లు అమ్ముకోవడం మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. స్టార్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ ఇటీవల వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో నటించిన సోలంకి దివాకర్ ఒక తోపుడు బండిపై పండ్లు అమ్మడం అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే.

    English summary
    Many actors life's have taken unexpected turns due to the corona virus. the lack of shooting stopped due to the lockdown, it became difficult for the poor artists to spend the day. Cine adults are providing help but it is not useful for most days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X