HanuMan Review: హనుమాన్ క్రిటిక్ రివ్యూ... దర్శకుడు ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఏంటంటే?
ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో హనుమాన్ ఒకటి. హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా ఇండియన్ సూపర్ హీరో కథాంశంతో రూపొందిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు.. పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ తన ట్విట్టర్ వేదికగా రివ్యూను తెలిపారు. ఇక ఆ రివ్యూపై దర్శకుడు ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఇచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఇండియన్ సూపర్ హీరో సినిమా హనుమాన్ తెరకెక్కింది. ఒక సాధారణ యువకుడికి హనుమంతుడి శక్తులు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఈ మూవీని రూపొందించారు. తన ఊరి కోసం ఆ యువకుడు ఏం చేశాడు అనే కథతో ఈ సినిమాని అద్భతంగా రూపొందించినట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.

సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలవుతుండగా.. అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ పెద్ద ఎత్తున బుకింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది. ప్రముఖ బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ఈ సినిమా చూసి బాగుందని తెలిపారు.
తన ట్విట్టర్ వేదికగా చెబుతూ వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు. హనుమాన్ ఫెన్టాస్టిక్ అంటూ ఆయన పేర్కొనడమే కాదు మూడున్నర రేటింగ్ కూడా ఇచ్చి షాకిచ్చాడు.దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక సాలిడ్ ఎంటర్టైనర్ సిద్ధం చేశారని తన ట్విట్టర్ లో రాసుకువచ్చాడు తరన్. హనుమాన్ ఎగ్జైటింగ్ గా ఉంటుందని వెల్లడించారు. సినిమాలో డ్రామా, ఎమోషన్స్ ఉండటమే కాకుండా... విఎఫ్ఎక్స్ మైథాలజీతో సింక్ అయ్యేలా చేశారని ఎన్నో గూస్ బంప్ మూమెంట్స్ కూడా ఉన్నాయని.. తన ట్విట్టర్ లో రాసుకువచ్చారు.

తేజ సజ్జ, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రకని, వెన్నెల కిషోర్ వంటి వారు అద్భుతంగా నటించారని తెలిపారు. ఇక సినిమాలో విఎఫ్ఎక్స్ ఒక కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేశారు. హిందీ డబ్బింగ్ కూడా బాగా కుదిరిందని ఆయన తన అభిప్రాయం తెలిపారు. ఇక ఇదే విషయం గురించి ప్రశాంత్ వర్మ తాజాగా తన ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్యూ సోమచ్ అంటూ తెలిపారు.
పాన్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రాబోతుంది. తెలుగు ప్రేక్షకులకే కాదు.. ఈ సినిమా పట్ల బాలీవుడ్ ఆడియెన్స్ లో కూడా మంచి ఆసక్తి నెలకొంది. చూడాలిమరి ఏ రేంజులో ఆకట్టుకుంటుందో. ఇక ఈ సినిమాకు పోటీగా తెలుగులో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











