పాయల్ ఘోష్‌పై లైంగికదాడి: అనురాగ్ కశ్యప్‌కు ముంబై పోలీసుల సమన్లు
బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్‌పై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం తెలుగు టెలివిజన్ ఛానెల్ ఏబీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు అని పాయల్ ఘోష్ వెల్లడించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో గతవారం వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అయితే ఫిర్యాదు చేసిన అనురాగ్ కశ్యప్‌ను విచారించకుండా తనను పోలీసులు వేధిస్తున్నారని పాయల్ ఘోష్ సోమవారం మీడియాకు తెలిపారు. అలాగే వైద్య పరీక్షల పేరుతో తన క్లయింట్‌ను వెర్సోవా పోలీసులు వేధిస్తున్నారని పాయల్ ఘోష్ లాయర్ కూడా వెల్లడించారు.

అనురాగ్ కశ్యప్‌కు పోలీసులు అండగా నిలుస్తున్నారు. తన పిటిషన్‌కు స్పందించడం లేదని మంగళవారం పాయల్ ఘోష్ మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు అనురాగ్ కశ్యప్‌కు సమన్లు జారీ చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పాయల్ ఘోష్‌కు న్యాయం చేయాలంటూ పలువురు బాలీవుడ్, సినీ, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. అదే విధంగా అనురాగ్ కశ్యప్‌కు అండగా పలువరు సినీ తారలు కూడా నిలవడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











