twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Google CEO Sundar Pichai పై బాలీవుడ్ దర్శకుడి కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?

    |

    గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌, మరో ఐదుగురిపై కేసు నమోదైంది. కాపీరైట్ హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణలపై బాలీవుడ్‌ సినీ ప్రముఖుడు ముంబైలో కేసు నమోదు చేశాడు. దాంతో పిచాయ్‌కి పోలీసులు నోటీసులు పంపే ఆలోచనలో ఉన్నారు. బాలీవుడ్ చిత్రాన్ని అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినందుకు బాధ్యుడిని చేస్తూ ఫిల్మ్ మేకర్ సునీల్ దర్శన్ కేసు నమోదు చేశారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

    మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. 2017లో విడుదలైన బాలీవుడ్ సినిమా ఏక్ హసీనా థి ఏక్ దీవానా థా చిత్రాన్ని మా అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ సినిమాకు లక్షలాది సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా విషయంలో యూట్యూబ్ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించింది అని తన పిటిషన్‌లో సునీల్ దర్శన్ పేర్కొన్నారు.

    Bollywood Director Suneel Darshan complaint against Google CEO Sundar Pichai

    ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా చిత్రానికి సంబంధించి లెక్కలేనన్ని హక్కుల ఉల్లంఘన జరిగాయి. చట్టవ్యతిరేకంగా మా సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అందుకు బాధ్యత సుందర్ పిచాయ్‌దే అని భావిస్తున్నాను. దాదాపు 1 కోటి వ్యూస్ ఈ సినిమాకు వచ్చాయి. నా ఫిర్యాదును కంపెనీ దృష్టికి తీసుకురావాలనే కారణంతో వారిపై చర్య తీసుకోవడం లేదుఅ ని తన పిటిషన్‌లో సునీల్ దర్శన్ తెలిపారు. ఈ వ్యవహారంలో గూగుల్ పిచాయ్, జో గ్రియర్, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

    ఇక ఏక్ హసీనా ఏక్ దివానా థా చిత్రం విషయానికి వస్తే.. సునీల్ దర్శన్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సినిమాలో శివ్ దర్శన్, నటాషా ఫెర్నాండేజ్, ఉపెన్ పటేల్ నటించారు.

    Recommended Video

    RRR Moivie : Ram Charan Is Calm But Jr NTR Is A Tsunami - SS Rajamouli | Filmibeat Telugu

    అలాగే సుందర్ పిచాయ్ విషయానికి వస్తే.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ఇచ్చింది. కొద్దికాలంగా గూగుల్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచయ్ భారతీయుడు అనే విషయం దేశానికి గర్వకారణంగా మారింది.

    English summary
    Bollywood Director Suneel Darshan complaint against Google CEO Sundar Pichai over Ek Haseena Thi Ek Deewana Tha copyright infringement in youtube.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X