బాలీవుడ్ డ్రగ్ కేసులో టెలివిజన్ తారలు.. అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న ఎన్సీబీ

బాలీవుడ్ డ్రగ్ కేసులో టెలివిజన్ నటి అబిగేయిల్ పాండే, ఆమె బాయ్‌ఫ్రెండ్, కోరియోగ్రాఫర్ సనమ్ జోహర్‌‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్ సప్లయర్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఇటీవల వారికి సమన్లు జారీగా చేయగా బుధవారం వారు విచారణకు హాజరయ్యారు. అబిగెయిల్, సనమ్ జోహర్ ఇద్దరు నాచ్ బలియే కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

బుధవారం ఉదయం అబిగెయిల్, సనమ్ జోహర్ ఇంటిలో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల తర్వాత వారి ఇంటి నుంచి కొన్ని వస్తువులను తమ వెంట తీసుకొళ్లినట్టు తెలిసింది. అనంతరం వారిని విచారణకు రావాలని ఆదేశించారు.

Bollywood Drug case: Sanam Johar and Abigail Pande grilled by NCB

ఇదిలా ఉండగా, డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు రావడం సంచలనం రేపింది. దీపికా పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దా కపూర్, దియా మిర్జాల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే దియా మీర్జా తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే దీపిక, సారా, శ్రద్దా కపూర్‌కు సమన్లు జారీ చేస్తారనే విషయాన్ని అధికారులు ధృవీకరించారు.

ఇదిలా ఉండగా, బుధవారం ఎన్సీబీ విచారణకు హాజరైన అబిగెయిల్ పాండే, పలు టీవీ షోలలో నటిస్తున్నారు. తుజ్‌సే హై రాబ్దా స్పిన్ ఆఫ్ అనే షోలో సనమ్ జోహర్, పాండే జంటగా కనిపించబోతున్నారు. ఈ షో జీ5లో ప్రారంభం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X