Emergency Release Date: ఇందిరా గాంధీని అచ్చుగుద్దిన కంగనా.. ఎమర్జెన్సీ రిలీజ్ అయ్యేది ఆరోజే!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఆమె అందం, అభినయానికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఆమె ప్రధాన పాత్రలో తాజాగా.. మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీతో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ఈరోజు ఈ సినిమా విడుదల తేదీతో పాటు కంగనా లుక్ ను విడుదల చేశారు. కంగనాను చూస్తుంటే అచ్చం ఇందిరా గాంధీని చూసిన ఫీలింగే వస్తుంది. అంతలా అచ్చు గుద్దినట్లు ఇందిరా గాంధీని దింపేసిన కంగనా లుక్ పై మీరూ ఓ లుక్ వేయండి. అలాగే సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు.. ఎమర్జెన్సీ విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో అసలు ఏం జరిగిందనే కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాకు నేరుగా కంగనా రనౌత్ యే దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నటిస్తున్నారు కూడా. ఇవి మాత్రమే కాకుండా.. మణికర్ణిక ఫిలిమ్స్ పతాకంపై ప్రొడ్యూస్ కూడా చేశారు. అయితే ఎమర్జెన్సీ సినిమా కాంగ్రెస్ కు కచ్చింతగా వ్యతిరేకంగా ఉంటుందని చాలా మంది సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంగనా బీజేపీకి చెందిన వ్యక్తిగా ముద్ర పడడం అందులోనూ ఆమె నుంచే సినిమా రావండతో ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి.

Bollywood Fire Brand Kangana Ranaut Emergency Movie Release Date Fixed Check Details

కంగనా రనౌత్ ఈ సినిమాలో ఇందిరా గాంధీగా కనిపించనుండగా.. అనపమ్ ఖేర్ జయప్రకాశ్ నారాయణ్ గా, మహిమ చౌదరి పపుల్ జయకర్ గా, విశక్ నాయర్.. సంజయ్ గాంధీగా, శ్రేయాస్ తల్పదే.. రిచార్డ్ భక్తి క్లెయిన్, స్కాట్ అలెగ్జాండర్ యంగ్... ప్రెసిడెంట్ రిచార్డ్ నిక్సాన్, లారీ న్యూయార్కర్.. లీటంట్ జనెరల్ గా కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీతో పాటు కంగనా రనౌత్ లుక్ ను కూడా ఈ రోజు విడుదల చేశారు.

Bollywood Fire Brand Kangana Ranaut Emergency Movie Release Date Fixed Check Details

కంగనా హీరోయిన్ గా.. ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను 2024 జూన్ 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నేరుగా కంగనా రనౌత్ యే ఈ విషయాన్ని ఎక్స్ వేధికగా ప్రకటించారు. భారతదేశంలో చీకటి గడియలు వెనుక ఉన్న కథను తెలుసుకోండియ అంటూ కంగనా రాసుకొచ్చింది. అలాగే చరిత్రలోనే అత్యం భయపడిన, భయపెట్టిన ప్రధాన మంత్రిని జూన్ 14వ తేదీన థియేటర్లలో చూడండి అంటూ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X