భార్య పాలు తాగుతున్న స్టార్ హీరో.. అది కూడా అలా దొంగిలించి..
కొన్ని వార్తలు చూస్తే అసలు ఇలా కూడా జరుగుతుందా అని అనిపిస్తుంది. అది నిజమో, అబద్ధమో .. అసలు నమ్మాలా వద్దా అని మనకే డౌట్స్ వస్తాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని కొందరి విషయంలోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. హీరోలు తమ ఫిట్‌నెస్ కాపాడుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. గంటలకొద్దీ జిమ్‌లో గడపటంతో పాటు హెల్దీ డైట్ ఫాలో అవుతూ ఏజ్ బార్ అవుతున్నా చెక్కు చెదరకుండా ఉంటారు. తాజాగా బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఖాన్ త్రయం, కపూర్‌లు, చోప్రాలు రాజ్యమేలుతోన్న బాలీవుడ్‌లో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్ ఖురానా వరుసపపెట్టి హిట్లు కొట్టారు. ఎంటీవీ రోడీస్‌తో బుల్లితెరపై హల్‌చల్ చేసిన ఆయుష్మాన్ ఖురానా అక్కడొచ్చిన పాపులారిటీతో 2012లో విక్కీ డోనర్ మూవీతో హీరో అవతారమెత్తాడు. వైవిధ్యమైన కథలతో ఖురానా సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఆయుష్మాన్ ఖురానా సినిమాలు చేస్తూ పోయారు.

ఆయుష్మాన్.. కాలేజీ చదువుతున్న రోజుల్లోనే తహిరా కశ్యప్ అనే అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం పెద్దల అంగీకారంతో 2008లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. తను హీరోగా నిలదొక్కుకోవడం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న దశలో విధి ఈ కుటుంబాన్ని చిన్న చూపు చూసింది. 2018లో తహిరాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో వీరి పిల్లలు చాలా చిన్నవాళ్లు. అయినప్పటికీ మొక్కవొని ఆత్మవిశ్వాసం, భర్త , కుటుంబం ఇచ్చిన తోడ్పాటుతో తాహిరా క్యాన్సర్ మహమ్మారిని జయించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తన భార్య గురించి అద్భుతంగా రాసుకొచ్చాడు. నీ గుండె ధైర్యాన్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానంటూ తాహిరాకు సర్జరీ జరిగినప్పుడు తీసిన ఫోటోను పంచుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరిపై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఆయుష్మాన్ ఖురానాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. అతను తన భార్య పాలను దొంగిలించి .. తన ప్రోటీన్ మిల్క్ షేక్‌లో కలుపుకుని తాగేవాడన్నది ఆ వార్త సారాంశం.

తాహిరా కశ్యప్ తన భర్త , పిల్లలను చూసుకోవడంతో పాటు రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. అలాగే ఆమె ఓ రచయిత్రి అన్న విషయం చాలా మందికి తెలియదు. 2021లో '' ది 7 సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్ '' అనే పుస్తకాన్ని తాహిరా రిలీజ్ చేశారు. తన భర్త నా పాలను దొంగిలించి, ప్రోటీన్ షేక్స్‌లో కలుపుకున్నాడని అందులో వెల్లడించింది. ఓ రోజున బ్యాంకాక్‌కు వెళ్లేముందు తాహిరా తన పాలను సీసాల్లో పట్టి ఉంచింది. అతను (ఆయుష్మాన్) బెడ్‌రూమ్‌లో ప్రోటీన్ షేక్స్ తాగుతూ ఉన్నాడు, పాల డబ్బాలు కనిపించకపోయే సరికి ఆయనను అడగ్గా.. మీసాలకు అంటిన పాలను తుడుచుకుంటూ నవ్వేవాడని తాహిరా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆయుష్మాన్ చివరిసారిగా డ్రీమ్ గర్ల్ -2లో నటించారు.


Click it and Unblock the Notifications











