ఆమెతో పెళ్లి కాకుంటే.. మాధురి దీక్షిత్‌కు లైన్ వేసేవాడిని.. సీనియర్ హీరో హాట్ కామెంట్
బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 1980ల నుంచి 1990ల వరకు హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరు. అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సర్ గానూ మాధురికి పేరుంది. అయితే మాధురీ దీక్షిత్ గురించి బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్ చేశాడు. ఆ వివరాళ్లోకి వెళితే...
అందం, అభినయంతో: మాధురీ దీక్షిత్.. ఈ పేరు ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. 1990ల్లో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె కోసమే.. ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీసేవారు. ముఖ్యంగా ఆమెను అందరూ డ్యాన్సింగ్ క్వీన్ అనేవారు. ఆమె నాట్యం కోసం ఎగబడి మరీ సినిమాను చూసేవారు. వయసు యాభై ఇప్పటికే అదే అందం, అభినయంతో ప్రేక్షకులను మురిపిస్తున్నారు. ఆమెను చూస్తే సగటు ప్రేక్షకుడే కాదు స్టార్ హీరో అయినా సరే మంత్ర ముగ్ధుడవ్వాల్సిందే.

మాధురీపై స్టారీ హీరో కామెంట్స్: బాలీవుడ్‌లో మాధురి దీక్షిత్ ఎంతో మంది అగ్రహీరోలతో కలిసి నటించింది. ఆమెతో నటించిన హీరోలందరూ తనపై ప్రశంసలతో ముంచెత్తేవారు. మరీ ముఖ్యంగా ఆమె అందానికి ఫిదా అయిపోయేవారు. ఆ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా బయట చెప్పేవారు. అయితే తాజాగా ఓ సీనియర్ హీరోగా అదే విషయాన్ని చెప్పారు. అసలు తనకు పెళ్లి కాకపోయి ఉంటే.. మాధురీని ట్రై చేసేవాడినని బహిరంగంగానే చెప్పారు.

మాధురి అంటే ఇష్టం: ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. మాధురీ దీక్షిత్‌పై తాజాగా అలనాటి సీనియర్ అండ్ గ్లామర్ హీరో గోవిందా ప్రశంసలు కురిపించారు. తాజాగా తన భార్య సునీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఇంటర్వ్యూయర్.. మీ ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్ ఏంటని ప్రశ్న అడిగింది. దానికి గోవింద భార్య సునీత మాట్లాడుతూ.. 'ఆయన మాధురీని ఇష్టపడతారు' అని చెప్పింది.
మాధురిని ట్రై చేసేవాడిని: ఆ వెంటనే గోవిందా మాట అందుకుని.. "రేఖను కూడా. ఎన్నో ఏళ్ల నుంచి వీరిద్దరు ఎటువంటీ కాంట్రవర్సీలు లేకుండా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరు ఎంతో అందమైన మహిళలు. వారి శరీరం మాత్రమే అందం కాదు.. మనసు కూడా ఎంతో స్వచ్ఛమైనది. వారు పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ఆకర్షణీయంగా, అందంగా ఉన్నారు. సునీత లేకపోతే, నేను తప్పకుండా మాధురిని ట్రై చేసేవాడిని" అని చెప్పుకొచ్చారు.

మంచి డ్యాన్సర్ గానూ మాధురికి పేరు: కాగా, పాప్ కా ఆంత్, ఇజ్జత్దార్, బడే మియా చోటే మియా, మహా సంగ్రామ్.. వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించారు గోవిందా, మాధురి దీక్షిత్. కాగా, మాధురి దీక్షిత్ 1980ల నుంచి 1990ల వరకు హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఎదిగారు. అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సర్ గానూ మాధురికి పేరుంది.


Click it and Unblock the Notifications











