క్షణక్షణం టెన్షన్.. SP బాలు ఆరోగ్య పరిస్థితిపై సల్మాన్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్

సీనియర్ గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై క్షణం క్షణం అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. నిన్న ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్లు ఎంజీఎం హాస్పిటల్ నుంచి ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఇక ఆయన త్వరగా కొలుకొని మళ్ళీ ఎప్పటిలానే పాటలను పాడాలని ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేస్తున్నారు. తెలుగు వారైన బాలసుబ్రహ్మణ్యం భాషా బేధం లేకుండా ప్రతి రాష్ట్ర సంగీత ప్రియులు ఆయనను ఎంతగానో అభిమానిస్తారు. దాదాపు ఇండియాలోని అన్ని భాషల్లో ఆయన పాటలు పాడారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా బాలు గారు త్వరగా కోలుకోవాలని మొదటిసారి ట్వీట్ చేశారు.

స్టార్ సెలబ్రెటీలు కూడా..

స్టార్ సెలబ్రెటీలు కూడా..

ఆగస్ట్ 5వ తేదీన కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హాస్పిటల్ కి వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం పరీక్షల అనంతరం పాజిటివ్ అని తేలడంతో అప్పటినుంచి హాస్పిటల్ లోనే చికిత్స అందుకుంటున్నారు. అయన త్వరగా కొలుకోవాలని చాలా మంది సెలబ్రిటీలు గత నెల నుంచి సోషల్ మీడియా ద్వారా వారి అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నారు.

సల్మాన్ ఖాన్ తో ప్రత్యేక అనుబంధం

సల్మాన్ ఖాన్ తో ప్రత్యేక అనుబంధం

ఇక బాలసుబ్రహ్మణ్యంపై బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ మొదటిసారి స్పందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు, సల్మాన్ ఖాన్ కు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. 90వ దశకంలో సల్మాన్ ఖాన్ సినిమా పాటలను చాలా వరకు SPB చేత పాడించేవారు. తుమ్సే మిల్నే కి తమన్నా హై, కబీ తు చాలియా లగ్తా హై, పెహ్లా పెహ్లా ప్యార్ హై, దిల్ దీవానా మరియు సాథియా ట్యూన్ క్యా కియా వంటి సాంగ్స్ ఎంతగా క్లిక్కయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేసు.

సల్మాన్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్

సల్మాన్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్

ఇక సల్మాన్ ఖాన్ చిత్రాలలో సాజన్ కే ఫూల్, హమ్ ఆప్కే హై కౌన్ మైనే ప్యార్ కియా వంటి ఆల్బమ్స్ కూడా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. కొన్నేళ్ల వరకు సల్మాన్ SPBని విడువలేదు. ఇక రీసెంట్ గా ఆయన ఆరోగ్యం క్షినించడంతో ట్వీట్‌లో సల్మాన్ ఖాన్ ఇలా వ్రాశాడు: "బాలా సుబ్రమణ్యం సార్.. మీరు మళ్ళీ బలంగా మారి త్వరగా కొలుకోవలని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను. మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు. మీ దిల్ దీవానా హీరో ప్రేమ్ (సల్మాన్ ఖాన్ 1989 చిత్రం మైనే ప్యార్ కియాలో పాత్ర) లవ్ యు, సర్. " అంటూ సల్మాన్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

Recommended Video

Telugu Cinema Paataku Praanam Nuvvu | Ravi Varma Potedar's Song On SPB
త్వరలోనే మరో అప్డేట్..

త్వరలోనే మరో అప్డేట్..

ఇక ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ వద్ద ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం ఇంకా పూర్తిగా కొలుకోలేదు. ఆయన ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ఆయన ఆరోగ్య క్రిటికల్ ఉందని చెప్పిన వైద్యులు ఇంతవరకు మరో అప్డేట్ ఇవ్వలేదు. ఈ రోజు మరో అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X