Priyanka Chopra: ఆస్తులు అమ్మేసుకుంటున్న ప్రియాంక చోప్రా.. అంత కష్టం ఏమొచ్చిందబ్బా?

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు పొందిన ఈమె... తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిది. అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కొన్నేళ్లపాటు బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఈ హాట్ బ్యూటీ... ఆ తర్వాత తన ప్రియుడు నిక్ జొనాస్ ని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలైపోయింది.

అలా అని ఖాలీగా ఉండకుండా ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ హాలీవవుడ్ తో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకెళ్తుంది. ఇటీవలే ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించి అందరినీ మెప్పిచింది. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ కోట్లలో ఆస్తులు సంపాధించుకుంది. అత్యంత ధనికవంతమమైన హీరోయిన్లలో ఒకరైన ఈమె ప్రస్తుతం తన ఆస్తులను అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఫుల్ రిచ్ అయిన ప్రియాంక చోప్రా ఆస్తులు అమ్ముకోవడంతో అంతా షాకవుతున్నారు.

 Bollywood Heroine Priyanka Chopra Selling Her Property Check Details

ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ఓ ప్రాపర్టీని అమ్ముకొని ఆ డబ్బులను తన ఖాతాలో జమ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోఖండ్ వాలో ఒక కమర్షియల్ ప్రాపర్టీని దాదాపుగా 7 కోట్ల రూపాయలకు అమ్ముకున్న ప్రియాంక చోప్రా.. తాజాగా అంధేరిలో ఉన్న తన అపార్ట్ మెంట్ ను కూడా అమ్మకానికి పెట్టేసిందట. ఆ విషయం తెలుసుకున్న టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పేరొందిన అభిషేక్ చౌబే ఆరు కోట్ల రూపాయలకు ఆ అపార్ట్ మెంట్ కొనగోలు చేశారని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. గతనెల 23వ తేదీ నుంచి 25వ తేదీల్లో ఈ లావాదేవీలు జరిగనట్లు సమాచారం.

 Bollywood Heroine Priyanka Chopra Selling Her Property Check Details

అయితే ఈ అపార్ట్ మెంట్ అమ్మకానికి సంబంధించిన వ్యవహారం మొత్తాన్ని ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రానే దగ్గరుండి చూసుకున్నారట. అంతేకాకుండా ఈ అమ్మకంలో భాగంగానే స్టాంప్ డ్యూటీ ఛార్జీలుగా 36 లక్షల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇలా ఆస్తులు అమ్మకుంటూ పోవడంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె అభిమానులు అయితే.. ఆమె పూర్తిగా అమెరికాలోనే ఉండిపోయేందుకే ఇక్కడి ఆస్తులు అమ్ముకుంటుందోమోనని భావిస్తున్నారు.

 Bollywood Heroine Priyanka Chopra Selling Her Property Check Details

ఇలా అయితే ప్రియాంక చోప్రా అభిమానులకు నిరాశ తప్పదనే చెప్పాలి. ఇప్పటికే అమెరికా పౌరసత్వం పొందిన ప్రియాంక చోప్రా.. ఇక్కడి ఆస్తులు అన్నీ అమ్మేసుకొని అక్కడే సెటిల్ అయిపోతుందేమోనని అనుకుంటున్నారు. ఇంతకాలం సినిమాలు, భర్తగా దగ్గరగా ఉండాలనే ఆమె అమెరికాలో ఉందనుకున్న అందరూ.. ఈ పరిణామాలతో తెగ ఇబ్బంది పడిపోతున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X