చిరంజీవితో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ప్లాన్.. ఈ మూవీ కూడా అదే రేంజ్‌లో ఉండేలా.!

By Manoj

రాజకీయాల నుంచి తప్పుకుని పూర్తిగా సినిమాలపై దృష్టి సారిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగానే ఆయన 'ఖైదీ నెంబర్ 150' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్లను సైతం అంతే స్థాయిలో రాబట్టడంతో ఆయనలో ఉత్సాహం రెట్టింపు అయింది. దీంతో చిరు వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఇటీవల 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని తర్వాత ఆయన మరో సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా దానికి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే..

నిరాశ పరిచిన భారీ సినిమా

నిరాశ పరిచిన భారీ సినిమా

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్లు మాత్రం అనుకున్న రేంజ్‌లో రాలేదు. దీంతో నష్టాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.

 ఈ సారి మిస్ కాకూడదని ప్లాన్

ఈ సారి మిస్ కాకూడదని ప్లాన్

తన తండ్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుని తీసిన ‘సైరా' అనుకున్న ఫలితాన్ని అందించకపోవడంతో.. రామ్ చరణ్ వెంటనే మరో సినిమా ప్లాన్ చేశాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడు. మ్యాట్నీ మూవీస్ సంస్థ సహా నిర్మాతగా వ్యవహరించనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

 మళ్లీ మెసేజ్‌తోనే.. మొదటిది మారింది

మళ్లీ మెసేజ్‌తోనే.. మొదటిది మారింది

కొరటాల అంటే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అలాగే వచ్చాయి. చిరుతో కూడా అదే ప్రయత్నం చేయబోతున్నాడట. దేవాలయ భూముల చుట్టు తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ముందు ఈ మూవీకి ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ ప్రకటించారు. కానీ, ఇటీవల ఇది ‘గోవిందా హరి గోవింద' అని మారిందని అన్నారు.

మళ్లీ అదే బాట.. ఈ సారి చిరు వాట

మళ్లీ అదే బాట.. ఈ సారి చిరు వాట

ఈ సినిమాకు కూడా భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ అందుకు అనుగుణంగానే ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సినిమాకు గానూ చిరంజీవి రెమ్యూనరేషన్ కింద కొన్ని ఏరియాల రైట్స్ తీసుకుంటున్నారని, వాటి విలువ రూ. 50 కోట్లు ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

చిరుతో బడా నిర్మాణ సంస్థ ప్లాన్

చిరుతో బడా నిర్మాణ సంస్థ ప్లాన్

త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించేందుకు బాలీవుడ్‌కు చెందిన ఓ బడా నిర్మాణ సంస్థ ముందుకు వచ్చిందని తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీన్ని కూడా తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో రూపొందించాలని వాళ్లు ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X