Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్‌రైజర్స్‌ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
జూలైలో రిలీజ్ అవుతున్న సినిమాలో ఇవే.. ఓటీటీలో సుశాంత్, విద్యాబాలన్ సినిమాలు
కరోనావైరస్ను అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు నాలుగు నెలులుగా థియేటర్లలో సినిమా రిలీజ్ ఆగిపోయాయి. ఇప్పుడు నిర్మాతలకు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అండగా నిలుస్తున్నాయి. గత నెల రోజులుగా ఓటీటీలో సినిమాల రిలీజ్ వేగం పుంజుకొన్నాయి. తాజాగా ఈ నెలాఖరులో నాలుగు భారీ చిత్రాలను నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవేమిటంటే..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బేచారా చిత్రం జూలై 24న డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతున్నది.
విద్యాబాలన్ నటించిన శకుంతలా దేవి, కునాల్ ఖేము నటించిన లూట్కేస్, నవాజుద్దీన్ సిద్ధిఖి, రాధికా ఆప్టే జంటగా నటించిన రాత్ అఖేలి హై చిత్రాలు జూలై 31న రిలీజ్ అవుతున్నాయి. ఇక విద్యుత్ జమ్వాల్, అమిత్ సద్ నటించిన యారా చిత్రం జూలై 30న రిలీజ్ కానున్నది.
మానవ కంప్యూటర్, గణిత మేధావి శకుంతలా దేవి జీవితం ఆధారంగా తెరకెక్కిన శకుంతలా దేవి చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 31న రిలీజ్ అవుతున్నది.
కునాల్ ఖేము, రసిక దుగ్గల్ జంటగా నటించిన లూట్ కేస్ చిత్రం జూలై 31న డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతున్నది.
నవాజుద్దీన్ సిద్ధిఖి, రాధికా ఆప్టే జంటగా నటించిన రాత్ అఖేలి హై చిత్రం జూలై 31న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్నది.
విద్యుత్ జమ్వాల్, అమిత్ సద్, శృతిహాసన్, విజయ్ వర్మ నటించిన యారా చిత్రం జూలై 30న జీ5 రిలీజ్ కానున్నది. ఈ చిత్రం ఏ గ్యాంగ్ స్టోరి అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా తెరకెక్కింది.