RRR రిలీజ్: సోదర భావం అంటే ఇదేనా? వాళ్ళు నష్టపోవడం కాయం: బోణి కపూర్ హాట్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకు కలెక్షన్స్ భారీగా రావాలి అంటే అన్నిటి కంటే ముఖ్యమయ్యింది రిలీజ్ డేట్. హిట్ టాక్ అనేది ఎప్పుడు రిలీజ్ అయినా వస్తాయి. కానీ సరైన సమయంలో సినిమాను విడుదల చేయకపోతే మాత్రం భారీగా నష్టాలు తప్పవు. ఇక RRR రిలీజ్ డేట్ ను ప్రకటించిందో లేదో అప్పుడే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్ బడా నిర్మాత అసంతృప్తి వ్యక్తం చేశాడు.

టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

 బాలీవుడ్ ఆడియెన్స్ కూడా

బాలీవుడ్ ఆడియెన్స్ కూడా

బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అందరి ఫోకస్ దీనిపైనే ఉంది. బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని రెస్పాన్స్ చూస్తుంటేనే అర్ధమవుతోంది.

పోటీగా అజయ్ దేవ్ గన్ సినిమా..

పోటీగా అజయ్ దేవ్ గన్ సినిమా..

అక్టోబర్ 13న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అసలైతే సంక్రాంతికే రావాలని అనుకున్నారు గాని అప్పుడు కొన్ని రిలీజ్ కావాల్సిన సినిమాలు ఉన్నాయని వెనక్కి తగ్గారు. ఇక ఇప్పుడు ఫిక్స్ చేసిన డేట్ కు మరో బాలీవుడ్ సినిమా రానుంది. అజయ్ దేవ్ గన్ హీరోగా నటించిన మైదాన్ సినిమా కూడా అప్పుడే విడుదల కానుంది.

బోనీ కపూర్ అసంతృప్తి

బోనీ కపూర్ అసంతృప్తి

మైదాన్ సినిమా ఫుట్‌బాల్ లెజెండ్ అబ్దుల్ రహిం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే మైదాన్ చిత్ర నిర్మాత బోణి కపూర్ RRR రిలీజ్ డేట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. RRR సినిమా కంటే ముందే మేము రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశాము. రెండు పెద్ద సినిమాలు ఓకే రోజున క్లాష్ అవ్వడం ఎవరికి శ్రేయస్కరం కాదు.

భారీగా నష్టపోయే అవకాశం ఉంది

భారీగా నష్టపోయే అవకాశం ఉంది

ఎగ్జిబ్యూటర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆడియెన్స్ మొదట్లోనే డివైడ్ అవుతారు. పెద్ద సినిమాలను రిలీజ్ చేయాలనుకున్న సమయంలో ఒక సినిమా మరొక సినిమాకు స్పేస్ ఇవ్వాలి. దీంతో కలెక్షన్స్ వీలైనంత వరకు తొందరగానే వస్తాయి. అయితే బయట చెప్పినట్లుగా ఇండస్ట్రీలో సోదర భావం కనిపించడం లేదని, ఆ విషయం చాలా ఈజీగా అర్థమవుతొందని.. బోనీ కపూర్ వివరణ ఇచ్చారు.

Recommended Video

RRR : Ram Charan, Jr NTR's Film To Release On This Date | Filmibeat Telugu

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X