Goodachari 2: అడవి శేష్‌కి విలన్‌గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో.. "ఓజీ"లోనూ ఇతడే!

అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా గురించి అందరికీ తెలిసిందే. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమాకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో దీనికి సీక్వెల్ చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. అయితే ఈ పార్ట్ 1 కు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. పార్ట్ 2ను వేరొకరు డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విలన్ ఎవరో తెలిసిపోయింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అడివి శేష్, శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా వచ్చిన గూఢచారి సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 2018లో విడుదలైన ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి పార్ట్ 2 కూడా తీయాలని భావించారు. ఈ విషయాన్ని అప్పట్లోనే ప్రకటించారు కూడా. కానీ ఇంతకాలానికి ఈ సినిమాకు మోక్షం వచ్చింది. గూఢచారి 2 సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ నామాలు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తుండగా.. కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Bollywood Romantic Hero Get Chance as Villain in Adavi Shesh Goodachari 2 Check Details

ఇదంతా ఇలా ఉండగా.. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది. పార్ట్ 2లోనూ హీరోహీరోయిన్లుగా అడవి శేష్, శోభితా దూళిపాళ్లనే సెలెక్ట్ చేయగా.. మిగతా నటీనటులు ఎవరు అన్నదానిపై ఇంత కాలం క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజా ఈ సినిమా షూటింగ్ లో ఓ బాలీవుడ్ స్టార్ హీరో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నారని కూడా సమాచారం.

Bollywood Romantic Hero Get Chance as Villain in Adavi Shesh Goodachari 2 Check Details

అయితే ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి. రొమాంటిక్ హీరోగా ఫుల్ క్రేజ్ ఉన్న ఈయన ఇప్పుడు గూఢచారి సినిమాలో విలన్ గా చేయబోతున్నారు. ఈరోజే ఇమ్రాన్ హష్మి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇలా ఈ సినిమాలో అడవి శేష్ ను అడ్డుకోబోయేది ఎవరో తేలిపోయింది. ఇమ్రాన్ హష్మి గుఢచారి 2లో మాత్రమే కాకుండా.. పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఇందులో కూడా నెగిటివ్ రోల్ లోనే కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X