RRR నుంచి దద్దరిల్లే సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన కీరవాణి.. ఫొటోతో అలా లీక్ చేసిన టాలెంటెడ్ సింగర్

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓ వైవు మెగా అభిమానులు మరోవైపు నందమూరి అభిమానుల్లో ఈ సినిమా రోజురోజుకు అంచనాల డోస్ ను అమితంగా పెంచేస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పై త్వరలోనే అప్డేట్ రానుందని ఇటీవల ఒక బాలీవుడ్ సింగర్ ఫొటోలతో సహా బయటపెట్టేశారు.

 అంచనాలు భారీగానే ఉన్నాయి

అంచనాలు భారీగానే ఉన్నాయి

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి బిగెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక సినిమాలో పాటలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

అంతకుమించి అనేలా

అంతకుమించి అనేలా

సాధారణంగా స్టార్ ఒక హీరో ఉంటేనే అంచనాల స్థాయిని చాలా ఈజీగా అందుకునే జక్కన్న ఇప్పుడు ఇద్దరు స్టార్స్ ను వెండితెరపై చూపించబోతున్నారు అంటే ఇంకా ఏ స్థాయిలో ఆలోచించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన పెద్దన్న సంగీత స్వరకర్త కీరవాణి ఇచ్చే మ్యూజిక్ కూడా అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పవచ్చు.

బాలీవుడ్ సింగర్ తో..

బాలీవుడ్ సింగర్ తో..

ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పై ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు సింగర్ అయినటువంటి విశాల్ మిశ్రాతో కీరవాణి ఒక పాట పాడించినట్లు సమాచారం. ఇక ఆ పాటను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Vakeel Saab Review : Pawan Kalyan పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్... సమస్యలను వేలెత్తి చూపించే కంటెంట్!!
మొదటి మ్యాజిక్ రెడీ

మొదటి మ్యాజిక్ రెడీ

రాజమౌళి, కీరవాణితో కలిసి ఉన్న ఒక సెల్ఫీ ఫొటోను కూడా ఆ సింగర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్టూడియో లో మేము ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాము. RRR కు సంబంధించిన ఒక సాంగ్ త్వరలోనే రానుందని కామెంట్ కూడా పెట్టారు. దీంతో ఆ సాంగ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొదటి పాటలోనే ఇద్దరి హీరోలకు సంబంధించిన వీరత్వాన్ని ప్రజెంట్ చేయనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X