47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ హీరో.. అమ్మాయి ఎవరో కాదు ప్రియురాలే!

2001లో మాన్ సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రణ్‌దీప్‌ హుడా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ హ్యాండ్ సమ్, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈయన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ముఖ్యంగా వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్‌ టెయిల్ , కిక్, రసియా, హైవే, సర్బ్‌ జిత్ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.

ప్రస్తుతం ఈయన స్వతంత్ర వీర సావర్కర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే... ఈ చిత్రంలో నటిస్తున్నాడు. 2001 నుంచి ఇప్పటికీ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. అద్భుతమైన టాలెంట్ ఉన్న టాప్ హీరోల్లో ఒకరు అయిన ఈయనకు ప్రస్తుతం 47 ఏళ్లు. అయితే 50 సంవత్సరాలకు దగ్గరలో ఉన్న ఈయన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఓ అమ్మాయితో చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. అయితే తాజాగా ఈయన పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మోడల్, నటి అయిన లిన్ లైశ్రామ్ మెడలో త్వరలోనే ఈయన మూడు ముళ్లు వేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

 Bollywood Star Hero Randeep Hooda Going to Marry His Girl Friend Check Details

మరో నాలుగైదు రోజుల్లో అంటే నవంబర్ 29వ తేదీ రోజేనే వీరి పెళ్లి చేసుకోబోతున్నారట. మణిపూర్ లో అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ వీరి వివాహం జరగబోతుందని తెలుస్తోంది. ఇటీవలే టాలీవుడ్ కపుల్స్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా.. ఈ బాలీవుడ్ జంట కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. లిన్ మణిపూర్ కు చెందిన అమ్మాయి కాగా... అక్కడే పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మణిపూర్ సంప్రదాయం ప్రకారమే వీరి పెళ్లి కూడా జరగబోతుందట.

 Bollywood Star Hero Randeep Hooda Going to Marry His Girl Friend Check Details

రణ్‌దీప్‌ హుడా, లిన్ లైశ్రాయ్ లు చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు, ప్రేమాయణం సాగిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ వీరు చాలా కాలం పాటు దీన్ని బయట పెట్టలేదు. గతేడాదే వీరిద్దరూ తమ బంధం గురించి అఫీషియల్ గా ప్రకటించి అందరి చేత ఆహా అనిపించుకున్నారు. అయితే ప్రేమించుకుంటున్నట్లు చెప్పిన సంవత్సరానికే పెళ్లి కూడా చేసుకోబోతున్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మీరూ ఓసారి వీరి అద్భుతమైన ఫొటోలు చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X