Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాబోతున్న బాలీవుడ్ బడా హీరో.. అందుకోసమైనా రావాల్సిందే!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో RRR నెంబర్ వన్ స్థానంలో ఉంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మొట్టమొదటిసారి మెగా నందమూరి హీరోలు కలిసి నటించారు. రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా వెండితెరపై అలరించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముంబైలోనే భారీగా ప్లాన్ చేసినట్లుగా అర్థం అవుతోంది. ఆ వేడుకకు ఒక బాలీవుడ్ స్టార్ ను రామ్ చరణ్ ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ప్రమోషన్ కోసం...
టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం RRR. ఇక డి.వి.వి.దానయ్య ఈ సినిమా కోసం ఇప్పటికే దాదాపు 450కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక సినిమాను ప్రమోట్ చేయడంలో కూడా చిత్ర ఏ మాత్రం తగ్గడం లేదు. వీలైనంత భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా మరికొంత బడ్జెట్ కూడా కేటాయించినట్లు సమాచారం.
ముంబైలో ఈవెంట్.. డేట్ ఫిక్స్
దుబాయ్ ఈవెంట్ గురించి పక్కన పెడితే ప్రస్తుతం ముంబైలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం RRR టీమ్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 17న గ్రాండ్ గా ముంబైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేధికను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో కొన్ని పేర్లు అయితే వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ స్పెషల్ ఇన్విటేషన్
బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈవెంట్ కు రామ్ చరణ్ ప్రత్యేకంగా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ - సల్మాన్ ఖాన్ ముందు నుంచి కూడా మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. అంతే కాకుండా ఉపాసన ఫ్యామిలీకి కూడా సల్మాన్ ఆప్తమిత్రుడు. కాబట్టి చరణ్ ఇన్విటేషన్ కోసమైనా సల్మాన్ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారని చెప్పవచ్చు.
Recommended Video
కరణ్ జోహార్ కూడా..
ఇక సల్మాన్ ఖాన్ తో పాటు రాజమౌళికి మంచి మిత్రుడు అయినటువంటి కరణ్ జోహార్ ఆ ఈవెంట్ లో ప్రత్యెక హోస్ట్ గా కూడా సందడి చేయనున్నట్లు సమాచారం. కరణ్ జోహార్ ఇదివరకే రాజమౌళి బాహుబలి సినిమాను బాలీవుడ్ లో భారీగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు RRR కు ఆయన డిస్ట్రిబ్యూటర్ గా లేకపోయినప్పటికీ రాజమౌళి కోసం ప్రమోషన్ విషయంలో భాగం అవుతున్నట్లు తెలుస్తోంది.