తెలుగులో బిజీగా మారుతున్న సంజయ్ దత్..KGF 2 విలన్‌గా సౌత్‌లోకి
ప్రస్తుత రోజుల్లో చాలా వరకు సీనియర్ యాక్టర్స్ ఒకే భాషలో నటించకుండా వివిధ భాషల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా సక్సెస్ అయిన వారు కూడా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్నారు. అవసరం అయితే విలన్స్ గా కూడా దర్శనమిస్తున్నారు. ఇక బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా అలాంటి తరహాలోనే అడుగులు వేస్తున్నారు.
KGF 2లో మెయిన్ విలన్ అధీరా పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై అన్ని భాషల అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పటి నుంచి సంజయ్ దత్ కి సౌత్ ఇండస్ట్రీలో చాలా ఆఫర్స్ వస్తున్నాయట. ముఖ్యంగా తెలుగు సినిమాలలో విలన్ పాత్రలు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారట ఓ వర్గం దర్శకులు.

తప్పకుండా హీరోలతో ఫైట్ చేయడానికి తాను సిద్ధమేనని చెప్పిన సంజయ్ దత్ కేవలం పాత్రలు నచ్చితేనే ఒప్పుకుంటాను అని చెబుతున్నారట. పాత్రలు నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తున్నారట. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న సినిమాలో సంజయ్ విలన్ గా కనిపించనున్నాడు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
ఇంకా ఆ విషయంలో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా కొన్ని తెలుగు సినిమాల్లో సంజయ్ స్పెషల్ గా కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











