Mega Star Chiranjeevi : గిన్నిస్ బుక్‌లోకి మెగాస్టార్ చిరంజీవి!

కొణిదెల శివశంకర వరప్రసాద్.. అలియాస్ చిరంజీవి. మూడున్నర దశాబ్థాలుగా తెలుగు తెరను మకుటం లేని మహారాజుగా ఏలుతున్న పేరు. కృషి, పట్టుదల, ప్రతిభ వంటి ఎంతటి సామాన్యుడైనా .. అసాధారణ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించిన వ్యక్తి చిరంజీవి. ఎంత ఎదిగినా ఒదిగే తత్వం ఆయనను అందరివాడిని చేసింది. డ్యాన్సులు, ఫైట్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్టాను పెంచి టాలీవుడ్‌కి తానే ఐకాన్‌గా మారారు. తాజాగా మెగాస్టార్ కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి చేరింది.

1978లో పునాదిరాళ్లు ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. సెకండ్ హీరోగా, సహాయ నటుడిగా, విలన్‌గా ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీతో చిరంజీవి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్‌ డ్యాన్స్‌ని తెలుగువారికి పరిచయం చేశారు. నాటి నుంచి నేటి వరకు వందలా సినిమాలలో తన స్టెప్స్‌లో అభిమానులను ఉర్రూతలూగించారు. చిరంజీవి మెగాస్టార్ కావడంలో డ్యాన్సులు ముఖ్య భూమిక పోషించాయనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. భారతదేశంలో రూ.కోటికి పైగా పారితోషికం తీసుకున్న తొలి నటుడు చిరంజీవే . దీంతో నాటి పత్రికలు, మ్యాగజైన్స్‌ ఆయనను బిగ్గెర్ దెన్ బిగ్ బీ అంటూ కీర్తించాయి.

Bollywood super star Aamir Khan presents Guinness book of world records to megastar Chiranjeevi

1999-2000 ఆర్ధిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లించినందుకు గాను చిరంజీవిని సమ్మాన్ అవార్డ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. తొలి రోజుల్లో సుప్రీం హీరోగా అభిమానుల చేత పిలిపించుకున్న చిరు.. మరణ మృదంగం నుంచి మెగాస్టార్‌గా మారారు. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకల్లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణ భారత నటుడు చిరంజీవి. ఘరాన మొగుడు రూ.10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.

కెరీర్‌లో నాలుగు నంది అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ సౌత్ పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ చిరంజీవి అందుకున్నారు. సినీరంగానికి అందించిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో మెగాస్టార్‌ను గౌరవించింది భారత ప్రభుత్వం. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిని పురస్కరించుకుని ఈ ఏడాదికి గాను ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌ను చిరంజీవికి ప్రకటించారు అక్కినేని నాగార్జున . తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లతో పాటు రాజకీయాల్లోకి వచ్చి తనకు చేతనైనంతలో ప్రజాసేవ చేశారు. ఇప్పటికీ సినీ కళాకారులు, సామాన్యులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించి మంచి మనసు చాటుకున్నారు.

Bollywood super star Aamir Khan presents Guinness book of world records to megastar Chiranjeevi

తాజాగా మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవి స్థానం సంపాదించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ చేతుల మీదుగా ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందుకున్నారు చిరు. ప్రపంచవ్యాప్తంగా 155 సినిమాలలో, అత్యధిక పాటల్లో డ్యాన్సులు చేసినందుకు గాను ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇంతటి ప్రతిష్టాత్మక గౌరవం పొందిన నేపథ్యంలో చిరంజీవిపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Read more about: megastar chiranjeevi aamir khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X