ఘోర రోడ్డు ప్రమాదానికి గురైనా షారుక్ ఖాన్ హీరోయిన్.. సినిమాలో యాక్షన్ సీన్‌ను మించి యాక్సిడెంట్ (వీడియో)
బాలీవుడ్ నటి గాయత్రి జోషి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో తన భర్తతో కలిసి గాయత్రి కారులో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన ఇటలీలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకొన్నది. అయితే ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నాం. నేను, నా భర్త వికాస్ ఒబెరాయ్ క్షేమంగా ఉన్నామని తెలిపింది. గాయత్రి జోషి విషయానికి వస్తే.. షారుక్ ఖాన్‌తో కలిసి స్వదేశ్ అనే చిత్రంలో నటించారు. అయితే కారు ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
నటి గాయత్రి జోషి తెలిపిన ప్రకారం.. నా భర్త వికాస్, నేను ఇటలీలో ఉన్నాం. మేము ప్రయాణిస్తున్న కారు అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. దేవుడి దయవల్ల మేమిద్దరం సురక్షితంగా బయపడ్డాం అని బాలీవుడ్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

వీడియోలో కారు ప్రమాదం జరిగిన తీరు చూస్తే సినిమాలో యాక్షన్ సీన్‌ను తలపించింది. గాయత్రి ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడింది. దాంతో గాయత్రి కారు మరో ట్రక్కును బలంగా గుద్దింది. దాంతో ట్రక్ రోడ్డుపైనే పల్టీలు కొట్టింది. ఆ సీన్ చూస్తే నిజంగా సినిమాలో మంచి రేసింగ్ సీన్ చూసినట్టు అనిపించింది. అయితే ఫెరారీ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మరణించారు. వారిని స్విట్జర్లాండ్‌కు చెందిన మెలీసా (63), మార్కస్ (67)గా గుర్తించారు.
ఇక గాయత్రి జోషి వ్యక్తిగత విషయాల్లోకి వెళితే.. ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 200 పోటీలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత అశుతోష్ గోవారికర్, షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన స్వదేశ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఎక్కువ రోజులు బాలీవుడ్‌లో ఉండలేదు. వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ను 2005లో వివాహం చేసుకొన్నారు. గాయత్రి జోషికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Click it and Unblock the Notifications











