బాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత.. హైదరాబాద్ వాసిగా రామాయణంలో కీలక పాత్ర.. 250కిపైగా చిత్రాల్లో...
బాలీవుడ్‌లో సీనియర్ నటుడు, రామాయణం సీరియల్‌లో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖర్ వైద్య ఇకలేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన జూలై 16వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో మరణించారు ఆయన వయసు 98 సంవత్సరాలు. చంద్రశేఖర్ వైద్య మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, టెలివిజన్ సెలబ్రిటీలను సంతాపం వ్యక్తం చేశారు.
చంద్రశేఖర్ మరణంపై ఆయన కుమారుడు అశోక్ శేఖర్ మీడియాకు వెల్లడిస్తూ.. 15వ తేదీ రాత్రి ఆయన ఆరోగ్యంతో ఉన్నారు. కానీ 16వ తేదీ ఉదయం మరణించడాన్ని గుర్తించాం. నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారు అని తెలిపారు. ఆయన మనవడు శక్తి అరోరా నటుడిగా రాణిస్తున్నారు.

చంద్రశేఖర్ వైద్య కెరీర్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రాజేశ్ ఖాన్నా పక్కన పలు చిత్రాల్లో ఆయన స్నేహితుడుగా నటించారు. రామాయణ్ టెలివిజన్ సీరియల్ ద్వారా మరింత గుర్తింపు పొందారు.
చంద్రశేఖర్ వైద్య 1922 జూలై 7వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. కాలేజీ విద్యను మధ్యలో వదిలేసి బాంబేకి వెళ్లిపోయారు. యూకేలో వెస్ట్రన్స్ డ్యాన్స్‌లో డిప్లోమా పొందారు. 1948లో సింగర్ శంషాద్ బేగం రికమండేషన్‌తో ఆయన పూనేలోని షాలీమార్ స్టూడియోలో ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత 1950లో బేబాస్ చిత్రంలో జూనియర్ ఆర్టిస్టుగా సినీరంగ ప్రవేశం చేశారు. నిర్దోషి, దాగ్, ఫర్మాయిష్, మీనార్ లాంటి చిత్రాల్లో నటించారు.
1954లో ఔరత్ తేరి యేహీ కహానీ చిత్రంతో నటుడిగా గుర్తింపు పొందారు. దాదాపు హిందీలో 250 చిత్రాల్లో నటించారు. సుహాగ్, గేట్ వే ఆఫ్ ఇండియా, భర్సాత్ కీ రాత్, బాత్ ఏక్ రాత్ ఏక్ చిత్రాల్లో నటించారు. శక్తి, బర్నింగ్ ట్రైన్, నమక్ హాలాల్, డిస్కో డ్యాన్సర్, షరాబీ లాంటి ప్రేక్షకాదారణ పొందిన చిత్రాల్లోనటించారు.


Click it and Unblock the Notifications











