Jr NTR మాట తప్పారు.. మమల్నీ మరిచిపోయారు.. అభిమాని తల్లి ఆవేదన..
Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తమకు ఇచ్చిన మాట తప్పారని కౌశిక్ అనే వీరాభిమాని తల్లి సరస్వతి ఆవేదన వ్యకం చేసింది. గతంలో క్యాన్సర్ లో బాధపడుతున్న అభిమాని కౌశిక్ ట్రీట్మెంట్ కి సాయం చేస్తానని, వీడియో కాల్ జూనియర్ ఎన్టీఆర్ తమకు హామీ ఇచ్చారని ఆమె వెల్లడించింది. అయితే.. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పారనీ, ఇప్పటివరకు అతడి దగ్గరి నుంచి ఏ సాయమూ అందలేదని అభిమాని తల్లి. ఇంతకీ ఏం జరిగిందంటే..
వివరాల్లోకెళ్తే.. తిరుపతి కి చెందిన శ్రీనివాసులు, సరస్వతి కుమారుడు కౌశిక్. అతడు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని, అయితే.. గత కొంత కాలంగా కౌశిక్ బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. దేవర సినిమా చూసి చనిపోవాలనుందని, అదే తన చివరి కోరిక అంటూ అప్పట్లో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటో తెగ వైరల్ అయింది.

అయితే.. ఈ వీడియో జూనియర్ ఎన్టీఆర్ దృష్టి వెళ్లడంతో చావుబతుకుల మధ్య ఉన్న తన అభిమానిని ఆదుకుంటానని, వారికి ఫ్యామిలీకి అండగా ఉంటాననీ,ఈమేరకు జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి కౌశిక్‌కు గుండెధైర్యం చెప్పాడు. ఇక్కడ బాగానే ఉంది. కానీ, తమకు తాము ఎలాంటి సాయం అందలేదని, తన కొడుకును కాపాడాలని కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందుకు వచ్చింది.
అభిమాని తల్లి సరస్వతి ఓ ప్రముఖ చానల్ బిగ్ టీవీతో మాట్లాడుతూ.. హీరో జూనియర్ ఎన్టీఆర్ నుంచి తమకు ఎటువంటి ఆర్థిక సాయం అందలేదనీ, ఎన్టీఆర్ అభిమానుల నుంచి రూ.2.5 లక్షలు ఇచ్చారు. అలాగే.. సీఎం సహాయక నిధి నుంచి రూ.11 లక్షలు, టీటీడి నుంచి రూ.40 లక్షలు వచ్చాయని తెలిపారు. ఆ డబ్బుతో తన కొడుకు కౌశిక్ కు ఆపరేషన్ చేయించామని తెలిపారు.

అయితే ఇంకా రూ.20 లక్షలు ఇస్తేనే.. తన కొడుకును డిశ్చార్జ్ చేస్తాంటుమనీ, ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ తో మాట్లాడుద్దామని ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందనీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది అభిమాని తల్లి.
ప్రస్తుతం తన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి బయటకు రావడానికి రూ. 20 లక్లలు అవసరమనీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కోరిక మేరకు హామి తీర్చాలని, దాతలు సహాయం చేయాలని కౌశిక్ తల్లి సరస్వతి కోరుతుంది.


Click it and Unblock the Notifications











