బోనికపూర్ చేతికి సౌత్ బ్లాక్‌బస్టర్.. వకీల్ సాబ్ తర్వాత మరోసారి పవన్ కల్యాణ్‌తో మూవీ!
పింక్ సినిమా రీమేక్‌తో దక్షిణాదిపై పట్టు సాధించిన ప్రముఖ నిర్మాత బోనికపూర్ ప్రస్తుతం సీన్ రివర్స్ చేశారు. ఇప్పడు మలయాళ చిత్ర పరిశ్రమలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఓ సినిమా హక్కులను సొంతం చేసుకొన్నాడు. దక్షిణాదిలో నేర్కొండ పార్వాయి, వకీల్ సాబ్ సినిమాలతో మంచి లాభాలను సొంతం చేసుకోవడం తెలిసిందే. ఈ రెండు సినిమా విజయోత్సహంతో ఈ సారి సౌత్ సినిమాను హిందీ, ఇతర భాషల్లో చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

మమ్ముట్టి వన్ రీమేక్ రైట్స్
మాలీవుడ్‌లో 2021 సంవత్సరంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన వన్ చిత్రం మంచి విజయాన్ని అందుకొన్నది.ఆ సినిమాకు సంబంధించిన అన్ని భారతీయ భాషల రీమేక్ హక్కులను బోని కపూర్ సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. ఈచిత్రం ఏప్రిల్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.ఈ చిత్రానికి దర్శకుడు సంతోష్ విశ్వనాథ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. వన్ చిత్రంలో మురళీ గోపి, జోజు జార్జ్, మ్యాథ్యూ థామస్, సిద్దిఖీ, ఇషానీ కృష్ణ,నిమిషా సాజయన్, గాయత్రీ అరుణ్ తదితరులు నటించారు.

నిజాయితీతో కూడిన ముఖ్యమంత్రి కథతో
మాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. 2022 తొలి భాగంలో వన్ సినిమా హిందీ, ఇతర భాషల రీమేక్ చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. నిజాయితీతో కూడిన ఓ ముఖ్యమంత్రి విధులు, సిద్దాంతాల కథా నేపథ్యంగా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో కేరళ సీఎంగా మమ్ముట్టి నటించారు. అవినీతి మంత్రులను తొలిగించే రైట్ టూ రీకాల్ అనే పాయింట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

భారీ రేటుకు సొంతం అంటూ
వన్ సినిమాపై ఆసక్తిని కనబరిచిన బోనీ కపూర్ భారీ రేటును చెల్లించి అన్ని భాషల హక్కులను సొంతం చేసుకొన్నారు అని మాలీవుడ్ మీడియా కథనాన్ని వెల్లడించగా, బోని కపూర్ ఈ వార్తను ధృవీకరించారు. దీంతో అనేక రూమర్లకు తెరపడ్డాయి. అయితే హిందీ, తెలుగులో ఏ హీరో ఈ పాత్రను పోషిస్తారనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.

పవన్ కల్యాణ్‌తోనేనా అంటూ..
అయితే వకీల్ సాబ్ తర్వాత, పవన్ కల్యాణ్‌తో బోనికపూర్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు ఈ మధ్య ఊపందుకొన్నాయి. వన్ సినిమా హక్కులను బోని కపూర్ చేజిక్కించుకొన్నారనే విషయం బయటకు పొక్కగానే పవన్ కల్యాణ్‌తో పక్కా అనే రూమర్ ఇప్పుడు మీడియాలో వైరల్ అయింది. అయితే పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్ మధ్య ఇది జరిగే పనేనా అనే వాదనను తెరపైకి తెచ్చారు.

బోనీ కపూర్ 2022 ప్లానింగ్ ఇలా
ఇక మాలీవుడ్‌లో విజయం సాధించిన హెలెన్ చిత్రాన్ని తన కూతురు జాన్వీ కపూర్‌తో తెరకెక్కించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో రూపొందిస్తున్న మైదాన్ చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత జాన్వీ కపూర్‌తో మూవీ రెడీ అవుతుంది. అలాగే తమిళ చిత్రం కోమలి రీమేక్‌గా తన కుమారుడు అర్జున్ కపూర్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











