Mike Tyson: మొత్తానికి లైగర్ పని పూర్తి చేసిన బాక్సింగ్ లెజెండ్.. పవర్ఫుల్ రోల్ కోసం ఒరిజినల్ వాయిస్!

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న మొట్టమొదటి యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా గతంలో ఎప్పుడూ లేనివిధంగా సరికొత్తగా హై వోల్టేజ్ యాక్షన్ లుక్ తో కనిపిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది.

కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో బజ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర సినిమాలో చాలా హైలెట్ గా ఉండబోతుందట. సినిమా స్టోరీ వినగానే మైక్ టైసన్ ఎలాంటి ఆలోచన లేకుండా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Boxing legend Mike Tyson Completes his dubbing for Liger movie

ఇక ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తిగా ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. రీసెంట్గా మైక్ టైసన్ కూడా తన డబ్బింగ్ పనులు పూర్తిచేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. అందుకు సంబంధించిన ఒక వీడియో ఫుటేజ్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది అని తప్పకుండా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని కూడా మైక్ టైసన్ దైన శైలిలో వివరణ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే లైగర్ సినిమా షూటింగ్ అలా పూర్తయిందో లేదో దర్శకుడు పూరి జగన్నాథ్ జనగణమన అనే మరొక ప్రాజెక్టును కూడా లైన్ లోకి తీసుకు వచ్చాడు. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పూరి ఆ కథను సరికొత్తగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందట.

రీసెంట్ గా చిత్ర యూనిట్ సభ్యులు ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్మెంట్ ఇవ్వడమే కాకుండా బాలీవుడ్ మీడియా ముందుకు వచ్చే సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. మరి లైగర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X