మహర్షి మూవీ సెట్లో బాయ్.. ఏం జరిగిందంటే
విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం "boy". అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న మహర్షి సినిమా షూటింగ్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ... ఈ సినిమా టైటిల్ 'బాయ్' నాకు బాగా నచ్చింది. బాయ్ స్టేజ్‌లో ప్రతి ఒక్కరికి ఎన్నో మెమొరీస్ ఉంటాయి. హై స్కూల్ యూనిఫాంలో ఉన్న స్టూడెంట్, స్కూల్ వైపు చూస్తూ ఉన్న ఈ పోస్టర్ వెనకున్న కాన్సెప్ట్ చూస్తుంటే, నాకు నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. అమర్‌కు సినిమా అంటే చెప్పలనేంత ఇష్టం. పోస్టర్ విషయంలోనే ఇంత శ్రద్ద తీసుకుంటే సినిమా ఇంకా బాగా తీసుంటారని అర్ధమవుతుంది. సమయం కుదుర్చుకుని ఈ సినిమా చూడాలనుంది అని అన్నారు. దర్శకుడు అమర్‌కి, "boy" చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ చెప్పారు.

నటీనటులు: లక్ష్య, వినయ్ వర్మ, సాహితి. నీరజ్ తదితరులు
కెమెరా: అష్కర్,
ఎడిటింగ్: ఏకలవ్యన్,
సంగీతం: ఎల్విన్ జేమ్స్.
సహ నిర్మాతలు: శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి.
నిర్మాతలు: ఆర్. రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్
రచన, దర్శకత్వం: అమర్ విశ్వరాజ్


Click it and Unblock the Notifications











