అద్దెకు బాయ్ ఫ్రెండ్.. నైట్‌కి కాదు డేకి.. అయినా వర్జిన్‌గా ..!!
ఈ మధ్య కాలంలో మామూలు సినిమా కంటే కష్ట రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకే కొందరు ఔత్సహికులు ఇలాంటి విభిన్నమైన కాన్సెప్ట్లు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు.. ఆ కోవలో వచ్చిందే బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ . కేరింత, మనమంతా, ఓ పిట్ట కథ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మాళవిక సతీషన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలయింది. ఆసక్తికరంగా సాగుతున్న ఈ టీజర్ వివరాల్లోకి వెళితే.

బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్
విశ్వంత్ హీరోగా బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే సినిమా రిలీజ్కి రెడీ అయ్యింది. మాళవిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా రామచంద్రన్ మధునందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూర్తి యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కి సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు.. స్వస్తిక సినిమా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల మీద వేణు మాధవ పెద్ది, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

విశ్వక్సేన్ సపోర్ట్ తో
ఇప్పుడు కుర్ర హీరో సినిమాలకి కాస్త పేరున్న హీరోలతో ప్రమోషన్ చేయించడం పరిపాటిగా మారింది. అలాగే ఈ సినిమా టీజర్ కూడా హిట్ సినిమా హిట్ కొట్టి ఫాంలో ఉన్న విశ్వక్సేన్ తో చేయించారు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని తాను కోరుతున్నానని విశ్వక్సేన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ యూనిట్ కి శుభాకాంక్షలు కూడా తెలిపారు.

బాయ్ ఫ్రెండ్ ఉద్యోగం
ఇక ఈ టీజర్ లో కి పెడితే ఎలాంటి ఉద్యోగం లేని ఒక యువకుడు ఈ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టించుకుని బాయ్ ఫ్రెండ్ లేక లోన్లీ గా ఫీల్ అవుతున్న అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ గా నటించడానికి రోజుకు ఇంత అని ఛార్జ్ చేస్తూ ఉంటాడు. అలా డబ్బు చార్జ్ చేసి అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ గా వెళుతూ ఉంటారు. అలా వెళ్తున్న నేపథ్యంలో ఒక అమ్మాయి ఏకంగా ఒక ఏడాది పాటు బాయ్ ఫ్రెండ్ గా నటించాలని కోరడం దానికి అతడు మీ దగ్గర అంత డబ్బు ఉందా అని అడగడం ఆసక్తికరంగా ఉంది. అలానే కేవలం డే టైంలోనే నటిస్తానని కండీషన్ కూడా పెడతాడు.

కానీ వర్జిన్
ఇక అదే భామతో పెళ్లిచూపులు సీన్ కూడా చూపించడంతో వీరిద్దరూ ప్రేమలో పడే అక్కడిదాకా వెళ్ళారనే లీక్ కూడా ఇచ్చారు.. ఇటు ఈ అమ్మాయి కంటే ముందు పూజా రామచంద్రన్ అలాగే మరికొంత మంది అమ్మాయిలు ఈయనని బుక్ చేసుకున్న నేపథ్యంలో తాను వర్జిన్ అని కేవలం బాయ్ ఫ్రెండ్ గా నటిస్తానని చెబుతూ తప్పించుకోవడం కూడా ఆసక్తికరంగా ఉంది. లోన్లీగా ఫీల్ అవుతున్న అమ్మాయిలకు కంపెనీ ఇస్తూ ఒక ఉద్యోగంగా మార్చుకోవడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తోంది.
రియల్ ఇన్స్పిరేషన్
గోపీసుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా మీద ఆసక్తి పెంచుతోంది.ఈ టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ ను బయట కూడా జరుగుతున్నాయి . రెంట్ ఎ బాయ్ ఫ్రెండ్ పేరుతో ముంబైలో అయితే ఒక డేటింగ్ యాప్ కూడా ఉంది. బహుశా ఇలాంటి వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి దర్శకుడు కథ రాసుకున్నాడు ఏమో అనిపిస్తోంది. కానీ టీజర్ చూస్తుంటే మాత్రం సినిమా ఆద్యంతం నవ్వులు పూయించేదిగా ఉంటుంది అని పిస్తోంది.


Click it and Unblock the Notifications











