ముదురుతున్న వరుణ్ తేజ్ వాల్మీకి వివాదం.. హైకోర్టులో పిటిషన్ దాఖలు!
Recommended Video
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వాల్మీకి'. శరవేగంగా షూటింగ్ జరుపుకొని విడుదలకు సిద్దమైన ఈ సినిమాపై వివాదాలు ముదురుతున్నాయి. గతంలో ఈ సినిమా టైటిల్ విషయంలో నెలకొన్న వివాదం ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వరకు వెళ్ళింది. పూర్తి వివరాల్లోకి పోతే..

వాల్మీకిలో వరుణ్ తేజ్ లుక్
గత సినిమాలకు భిన్నమైన లుక్‌లో గుబురు గడ్డంతో వాల్మీకి సినిమాలో కనిపిసితున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ చిత్రంలో వరుణ్ లుక్ ఎలా ఉంటుందో రెవీల్ చేశాయి. పైగా ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్ మాస్ లక్షణాలతో కుడి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వాల్మీకిపై వివాదాలు చుట్టుముడుతున్నాయి.

వివాదం.. షూటింగ్ నిలిపివేత
వాల్మీకి అనేది తమ కులానికి చెందిన వ్యక్తి పేరని, దాన్ని ఉపయోగించుకోవడమే గాక తుపాకీ వంటి ఆయుధాన్ని పట్టుకొని స్టిల్స్ ఇస్తుండటం సరికాదని వారు గతంలో బోయ కులస్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారు షూటింగ్ జరగనీయకుండా అడ్డుకున్నారు కూడా. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడటంతో ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు బోయ కులస్థులు.

హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఈ నేపథ్యంలోనే ఇటీవలే వాల్మీకి టైటిల్ మార్చేయాలంటూ ధర్నా చేపట్టారు. అయితే చిత్రబృందం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోక పోవడంతో వారంతా హైకోర్టును ఆశ్రయించారనేది తాజా సమాచారం. తమ కులస్థుల మనోభావాలు దెబ్బతీసేలా వాల్మీకి యూనిట్ సినిమా రూపొందించిందని, సినిమా టైటిల్ వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

వాల్మీకి మూవీ
14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట వాల్మీకి చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా ఈ రూపొందింది. చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే నటించింది. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 13 వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.


Click it and Unblock the Notifications











