అక్కడ భారీ రేటు పలికిన బాలయ్య మూవీ: BB3ని దక్కించుకున్న ప్రైడ్ సినిమా

కొన్నేళ్లుగా సరైన విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జోడీ కట్టాడు. 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతో BB3 బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ రైట్స్ అత్యధిక ధర పలికాయి.

పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)

బాలయ్య కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ప్రైడ్ సినిమా సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రూపొందించి ఇంటర్నెట్‌లో వదిలింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను సదరు సంస్థ రూ. 2 కోట్ల వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తున్నారు. దీనికి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మే 28న ఇది విడుదల కానుంది.

Boyapati - Balakrishna Movie Overseas Rights Bagged Pride Cinemaa

ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేజిక్కించుకున్నారని ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందుకోసం ఆయన రూ. 15 కోట్లు వెచ్చించారని అన్నారు. అంతేకాదు, BB3 ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల థియేట్రికల్ హక్కులను వారాహీ చలన చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి రూ. 35 కోట్లకు కొనుగోలు చేశారట. అలాగే, సీడెడ్ హక్కులను బల్లారి శ్రీను రూ. 12 కోట్లకు కొన్నారని సమాచారం. ఈ మూడు ప్రాంతాలకే రూ. 60 కోట్లు వచ్చాయి. బాలయ్య కెరీర్‌లో ఇదే అత్యధిక బిజినెస్ అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X