Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జై బాలయ్య అనే వరకు వదల్లేదు.. బోయపాటిని విసిగించిన నందమూరి ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ తీరాన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా బోయపాటి శ్రీను, జీవిత, రాజశేఖర్ విచ్చేశారు. ఈ వేదికపై అందరూ మాటల ప్రవాహాన్ని తలపించేలా ప్రసంగించారు. అయితే బోయపాటి వేదికపై ఎక్కడంతో అభిమానుల సందడి రెట్టింపైంది.
అభిమానుల గోల..
ప్రతీ హీరో వేడుకలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే అవి కావాలని చేస్తారో.. అనుకోకుండా చేస్తారో కానీ అవతల ఉన్న వారికి చిరాకును పుట్టిస్తాయి. కొంతమంది వాటిని లైట్ తీసుకుని వారి ప్రసంగాలను ముందుకు కొనసాగిస్తే మరికొందరు ఫ్యాన్స్‌ను హెచ్చరించడం, బుజ్జగించడం లాంటివి చేస్తుంటారు.
బుజ్జగించిన బోయపాటి..
రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన బోయపాటి శ్రీను వేదికపై ఎక్కి స్పీచ్ మొదలుపెట్టడంతో అభిమానుల కేరింతలతో ఆ ప్రాంగణమంతా హోరెత్తింది. జై బాలయ్య అనే నినాదాలతో సందడిగా మారింది. స్పీచ్ మొదలు పెట్టన్నంతగా వాటి సౌండ్ ఎక్కువ కావడంతో.. చేసేదేం లేక బోయపాటి సైతం జై బాలయ్య అని ఓకేనా అంటూ ప్రసంగాన్ని ప్రారంభించాడు.
విసిగించిన ఫ్యాన్స్..
అలా ప్రసంగాన్ని కొనసాగిస్తుంటే మధ్యలో రెండు సార్లు మళ్లీ జై బాలయ్య నినాదాలు హోరెత్తాయి. బోయపాటి సైతం జై బాలయ్య.. ఓకేనా అంటూ అలా ముందుకు సాగిపోయాడు. అయితే ఇది వారికున్న అభిమానమే కావచ్చు కానీ, స్టేజ్‌పైకి ఎక్కి మాట్టాడే వారికి ఇబ్బందిని కలిగించే అవకాశముంది. ఈ అల్లరితో వారు అనుకున్నది చెప్పలేకపోవచ్చు.
అదరగొట్టిన బోయపాటి..
కేఎస్ రవికుమార్ గురించి చెబుతూ.. ఆయన తీసిని సినిమాల్నీ మాకు రిఫరెన్స్ అని, మళ్లీ మళ్లీ చూసుకునేలా ఉంటాయని చెప్పుకొచ్చాడు. బాలయ్య గురించి మాట్లాడుతూ.. రూలర్ అనే టైటిల్ ఆయనకు పర్ఫెక్ట్ అని కితాబిచ్చాడు. ఆయన రూలర్ ఆఫ్ ఆర్ట్స్, రూలర్ ఆఫ్ హార్ట్స్ అని చెప్పుకొచ్చాడు. బాలయ్య, తాను చేయబోయే సినిమాలో హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదని, జనవరిలో షూటింగ్ మొదలుపెడతామని, అప్పుడు అన్ని విషయాలు తానే వెల్లడిస్తానని తెలిపాడు.