స్టార్ హీరోయిన్‌తో బోయపాటి మంతనాలు.. భారీ ఫ్లాప్ తర్వాత సాహసం చేస్తుందా.!
టాలీవుడ్‌లో ఎంతో మంది డైరెక్టర్లు, హీరోలు ఉన్నప్పటికీ.. కొన్ని కాంబినేషన్లు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాయి. అలాంటి వాటిలో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో కూడా ఉంది. వీరిద్దరి కలయికలో ఇప్పటికే 'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ రెండింటి తర్వాత వీళ్లు మరోసారి జతకట్టారు. త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా హీరోయిన్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

బాలయ్యకు ఈ ఏడాది కలిసి రాలేదు
నటసింహా నందమూరి బాలకృష్ణకు 2019వ సంవత్సరం అస్సలు కలిసి రాలేదు. ఈ ఏడాది ఆయన ‘యన్.టి.ఆర్' బయోపిక్ రెండు భాగాలు సహా ఇటీవల ‘రూలర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూడు చిత్రాలు ఘోర పరాజయాలను చవి చూశాయి. అదే సమయంలో నష్టాలను కూడా మిగిల్చాయి.

బోయపాటిపై పెరుగుతున్న ఒత్తిడి
వరుస పరాజయాలతో బాధ పడుతున్న సమయంలో బోయపాటి శ్రీను బాలయ్యకు ‘సింహా' సినిమాతో బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు ‘లెజెండ్'తో ఆదుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఇబ్బందులు పడుతున్న సమయంలో హిట్ ఇవ్వాలని ఆయన కసిగా పని చేస్తున్నాడు. ఇప్పుడు బాలయ్య వల్ల ఆయనపై బాగా ఒత్తిడి పెరుగుతోందని టాక్.

ఇద్దరూ కలిసి హిట్ ట్రాక్ ఎక్కాలని ప్లాన్
ఈ సినిమా ద్వారా హిట్ ట్రాక్ ఎక్కాలని బాలయ్యతో పాటు బోయపాటి కూడా భావిస్తున్నాడు. మెగా హీరో రామ్ చరణ్ తేజ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఆయన నిరాశకు గురయ్యాడు. దీంతో బాలయ్య సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇందులో భాగంగానే స్క్రిప్ట్, మేకింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

చాలా మంది పేర్లు బయటకు.. ఫైనల్ కాలేదు
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించే వారి విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ముఖ్యంగా ఇందులో బాలీవుడ్ నటులు సంజయ్ దత్ నటిస్తున్నాడని అన్నారు. అలాగే, రోజా విలన్ రోల్ చేస్తుందనే టాక్ వినిపించింది. వీరితో పాటు అనసూయ, రష్మీ గౌతమ్ సహా జబర్ధస్త్ నటులు ఇందులో నటిస్తున్నారని ఎంతగానో ప్రచారం జరిగింది.

స్టార్ హీరోయిన్‌తో బోయపాటి మంతనాలు
ఇందులో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తుందని గతంలో ప్రచారం జరిగింది. దీంతో ఆమె స్వయంగా స్పందించి ఈ వార్తలు అబద్దమని చెప్పింది. అప్పటి నుంచి ఇందులో హీరోయిన్‌గా ఎవరు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోయపాటి.. రకుల్ ప్రీత్ సింగ్‌తో మంతనాలు జరుపుతున్నారని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది.

భారీ ఫ్లాప్ తర్వాత సాహసం చేస్తుందా.!
రకుల్.. కొద్ది రోజుల క్రితం ‘మన్మథుడు 2'లో సీనియర్ హీరో అయిన నాగార్జునకు జోడీగా నటించింది. ఇందులో ఆమె క్యారెక్టర్ ఎంతో బోల్డుగా కనిపించింది. ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మరో సీనియర్ హీరో సినిమాలో నటించే సాహసం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











