రంగంలోకి బాలకృష్ణ.. క్రేజీ ఫైట్.. ఇక నందమూరి అభిమానులకు పండగే!!
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు 'రూలర్' తర్వాత బాలయ్య బాబు తన తర్వాతి ప్రాజెక్టును లైన్ లోకి తీసుకొచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ కొద్దిసేపటి క్రితం మొదలు పెట్టేశారు. మరి ఆ షూటింగ్ ఎక్కడ మొదలైంది? ఆ వివరాలేంటి? ఓ లుక్కేద్దామా..

బాలకృష్ణ 106.. అభిమానుల్లో ఆతృత
బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ క్రేజీ కాంబోలో బాలకృష్ణ 106వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించినప్పటికీ, రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లడం ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో బాలయ్య అభిమానుల్లో ఎప్పుడెప్పుడా ఆతృత రెట్టింపవుతూ వచ్చింది.

ఫైనల్ స్క్రిప్ట్ రెడీ.. తొలి షెడ్యూల్ స్టార్ట్
స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయమని బాలయ్య ఇచ్చిన సూచనల మేరకు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కాస్త ఆలస్యమైంది. అయితే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న బోయపాటి.. ఈ రోజే (మార్చి 2) మొదటి షెడ్యూల్ ప్రారంభించి నందమూరి అభిమానుల్లో ఉన్న ఆతృతను తెరదించారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కొద్ది సేపటి క్రితం ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.

క్రేజీ ఫైట్.. ఆరంభమైదే
తొలి షాట్ లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన క్రేజీ ఫైట్ చిత్రీకరణతో ఈ షూటింగ్ ప్రారంభం కావడం విశేషం. బోయపాటి- బాలకృష్ణ కాంబోలో హాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను త్వర త్వరగా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుంచాలని బోయపాటి భావిస్తున్నారట.

బాలయ్య డ్యూయల్ రోల్.. గతంలో ఎన్నడూ చూడని విధంగా!
మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా బోయపాటి ఈ కథను సిద్ధం చేశారట. అయితే ఈ సినిమాలో బాలయ్యబాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. అందులో ఒకటి అఘోరా పాత్ర అని తెలిసింది. ఈ పాత్రలో బాలయ్య అభినయం గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండేలా ప్లాన్ చేశారట బోయపాటి.
Recommended Video


బాలయ్యకు జోడీగా ఇద్దరు భామలు
ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ఇద్దరు క్రేజీ హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా ఈ ఇద్దరూ సోనాల్ చౌహాన్, అంజలి అనే టాక్ బలంగా వినిపించినప్పటికీ.. వాళ్ళిద్దరినీ కాదని, మెయిన్ హీరోయిన్‌గా శ్రీయ, మరో హీరోయిన్ గా నయనతారను తీసుకున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











