twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda pre release.. బాలయ్య చేతికి గాయం.. అందుకు నేనే కారణం.. అసలు విషయం బయటపెట్టిన బోయపాటి

    |

    నట సింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో బోయపాటి శ్రీను ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

    జై బాలయ్య అంటూ బోయపాటి

    జై బాలయ్య అంటూ బోయపాటి

    జై బాలయ్య అంటూ బోయపాటి మాట్లాడుతూ.. సమయం మించిపోయింది. నేను చాలా తక్కువగా మాట్లాడుతాను. బాలయ్య, బన్నీ మాట్లాడాల్సి ఉంది. ఈ వేడుకకు వచ్చిన అల్లు అర్జున్, పిలువగానే వచ్చిన రాజమౌళి గారికి ధన్యవాదాలు. అలాగే సోదర సమానులైన నందమూరి అభిమానులకు ధన్యవాదాలు. ఇక మంచి సినిమా తీస్తే ఎలాంటిఆదరణ దక్కుతుందో సింహా, లెజెండ్ నిరూపించాయి. ఇప్పుడు అఖండ కూడా అదే కేటగిరిలో చేరుతుంది. మీరు హ్యాపీగా సినిమా చూసి గుండెలపై చేయి వేసుకొని చూసి వచ్చే చిత్రాన్ని రూపొందించాం. ఇది మాకు హ్యాట్రిక్ సినిమా అవుతుంది.

    కరుణించమని అడుగు.. కనిపించమని కాదు..

    కరుణించమని అడుగు.. కనిపించమని కాదు..

    అఖండ సినిమా టీజర్ చూశారు. ట్రైలర్ చూశాడు. దేవుడిని కరుణించమని అడుగు.. కనిపించమని కాదు.. అది డైలాగ్. జై బాలయ్య అనే మంచి సాంగ్ చూశాఢు. ఆ పాటను కంపోజ్ చేసింది భాను మాస్టర్. జై అఖండతోపాటు మిగితా పాటలను శంకర్ మాస్టర్ గారు చేశారు. నాతోపాటు స్టంట్స్ చేశారు. మాటలు రాసిన రత్నంగారు, సినిమాటోగ్రాఫర్ సీ రాంప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ గారు.. ఇలాంటి సినిమా తీయాలంటే సైన్స్ కావాలి. ఆ విషయం సినిమా చూసిన తర్వాత మీరే చెబుతారు. ఇక మ్యూజిక్ ఇచ్చిన థమన్ గారు.. దీంతో పాటు ఒకే వ్యక్తి బాలయ్య గురంచి చెప్పాలి.

    నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి థ్యాంక్స్

    నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి థ్యాంక్స్

    అఖండ సినిమాలో బాలయ్యలో ఉండే ఎనర్జీని చెప్పడం సరికాదు. తెర మీదే డిసెంబర్ 2వ తేదీన మీరే చూస్తారు. 21 నెలలపాటు కరోనావైరస్ కారణంగా వెనుక పడ్డాం. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను రాజీ పడకుండా తీసిన నా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి ధన్యవాదాలు అని అన్నారు.

    బాలయ్య చేతికి గాయానికి కారణం నేనే

    బాలయ్య చేతికి గాయానికి కారణం నేనే

    బాలయ్యతో చేతికి గాయానికి కారణం నేనే. జై బాలయ్య పాట కోసం రిహార్సల్ చేశారు. ఆ సమయంలో జారిపడి భుజంపై పడ్డారు. అప్పటికే నేను కోటి రూపాయలు పెట్టి సెట్ వేశాం. ఆ విషయం తెలిసి గుండె జారింది. ఎలా అని భయపడుతుంటే.. బాలయ్య సెట్‌కు వచ్చారు. ఏం చేద్దాం అంటే.. ఆయన సిద్దంగా ఉన్నారు. నొప్పి ఉంటే మాస్ పాటను ఆపేద్దామని అన్నాను. అప్పటికే భుజం డిస్ లోకేట్ అయింది. అయితే ఆ సమయంలో బాలయ్య ఒకే ఒక మాట చెప్పారు. ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా అంటూ ధైర్యం ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో చేసిన సాంగ్ జై బాలయ్య. ఆ పాటకు అందరూ చప్పట్లు కొడితే ఆ ఆనందంచెప్పలేంఅ ని బోయపాటి అన్నారు.

    Recommended Video

    Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
    నాకు అండగా నిలిచిన అల్లు అర్జున్, బాలయ్య

    నాకు అండగా నిలిచిన అల్లు అర్జున్, బాలయ్య

    నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే సమయంలో నాకు సపోర్ట్‌గా నిలిచింది బన్నీ. నేను డైరెక్టర్‌గా రాణిస్తున్న నేపథ్యంలో నా పురోగతికి సహాయపడింది బాలయ్య. వీరందరికి నా థ్యాంక్స్. డిసెంబర్ 2వ తేదీన అఖండ వస్తున్నది. డిసెంబర్ 17వ తేదీన పుష్ప వస్తున్నది. ఇప్పుడు సినిమా గెలువాలని కోరుకొంటున్నాను. అఖండ తర్వాత పుష్ప, RRR, భీమ్లా నాయక్ కూడా విజయం సాధించాలి అని బోయపాటి అన్నారు.

    English summary
    Nandamuri Balakrishna' Akhanda pre release event: Allu Arjun, SS Rajamouli are chief guest
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X