Ram Pothineni తో బోయపాటి యాక్షన్ రెడీ.. భారీ పోరాటాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో..
అఖండ తర్వాత మరో భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో దర్శకుడు బోయపాటి శ్రీను రంగంలోకి దిగాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 9గా ప్రతిష్టాత్మకంగా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దసరా పండుగ శుభ సందర్బాన్ని పురస్కరించుకొని రామ్ సరసన నటించే హీరోయిన్ శ్రీలీల వివరాలను మీడియాకు అందించారు. ఇటీవల టాలీవుడ్‌లో తన బీజీఎంతో సంచలనాలు రేపుతున్న ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇలాంటి విశేషాలను సొంతం చేసుకొన్న ఈ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో అక్టోబర్ 6వ తేదీన ప్రారంభమైంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ.. మా దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ' విజయం తర్వాత చేస్తున్న చిత్రమిది. ఆ సినిమాకు రోరింగ్ రీ రికార్డింగ్ అందించిన తమన్ మా సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. వాటికి తగ్గట్టు సినిమా ఉంటుంది అని తెలిపారు.

రామ్ ఎనర్జీకి పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యే క్యారెక్టర్‌ను బోయపాటి శ్రీను డిజైన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. స్టంట్ శివ నేతృత్వంలో ఆ యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్నాం. సుమారు 30 రోజులు ఈ షెడ్యూల్ ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఉన్నత సాంకేతిక విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ చిత్రమిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని శ్రీనివాస చిట్టూరి చెప్పారు.
నటీనటులు: రామ్ పోతినేని, శ్రీ లీల తదితరులు
ఎడిటింగ్ : తమ్మిరాజు
సినిమాటోగ్రఫి: సంతోష్ డేటకీ
యాక్షన్: స్టంట్ శివ
సంగీతం: ఎస్ తమన్
సమర్పణ: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
దర్శకత్వం: బోయపాటి శ్రీను.


Click it and Unblock the Notifications











