దర్శకుడు బోయపాటి ఇంట్లో విషాదం
టాలీవుడ్ బడా దర్శకుడు బోయపాటి శ్రీను తల్లి బోయపాటి సీతారావమ్మ(80) శుక్రవారం మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామం. అక్కడే ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంనుంచి అస్వస్థతతో బాధపడుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి 7.22 నిమిషాలకు మరణించారు.
పలువురు సినీ ప్రముఖు బోయపాటికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తల్లి మరణం పట్ల బోయపాటి శోకసంద్రంలో మునిగిపోయారు. హైదరాబాద్‌లో ఉన్న బోయపాటి తన ఫ్యామిలీతో కలిసి పెదకాకాని చేరుకున్నాడు. శనివారం ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

బోయపాటి ప్రస్తుతం బాలయ్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు గతంలోనే ప్రకటించారు. అయితే బోయపాటి మాతృమూర్తి ఆకస్మిక మృతితో ఈ సినిమా కాస్త ఆలస్యమయ్యేట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











