Just In
- 35 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నందమూరి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: బాలయ్య - బోయపాటి సినిమాకు కొత్త సమస్య.!
వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. గత ఏడాది ఆయన నుంచి వచ్చిన మూడు సినిమాలూ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో తనకు రెండు భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే...

ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేదు
గత ఏడాది ప్రారంభంలో నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన రెండు భాగాల్లో నటించారు. ఈ రెండూ భారీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఇక, ఇటీవల వచ్చిన ‘రూలర్' కూడా ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేదు. ఫలితంగా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చింది.

హ్యాట్రిక్ చేయడానికి కలిశారు
గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్‌లను అందించిన బోయపాటి శ్రీనుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి ఈ సినిమా ‘రూలర్' కంటే ముందే తెరకెక్కాలి. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ కూడా హిట్ అయితే.. బోయపాటి - బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ నమోదు అవుతుంది.

వాళ్లందరూ ఇందులో నటిస్తున్నారు
ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇది తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం ఈ సినిమా గురించి ప్రచారం అవుతున్న అంశాలే. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేస్తున్నారని, రోజా విలన్‌గా నటిస్తుందని, బుల్లితెర యాంకర్లు రష్మీ, అనసూయ సహా జబర్ధస్త్ టీమ్ ఇందులో నటిస్తుందని ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

నందమూరి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్
కొద్ది రోజుల్లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ వాయిదా పడుతుందట. దీనికి కారణం మొదట అనుకున్న స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తుండడమే అని సమాచారం. బాలయ్య సూచన మేరకు బోయపాటి ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్.

ఆ ప్రభావం భారీగా పడిందంటున్నారు
ఈ సినిమా కథలో ఉన్నట్లుండి మార్పులు చేయడానికి కారణం ‘రూలర్' సినిమా ప్రభావమేననే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగానే ఇందులో మార్పులు చేస్తున్నారని అంటున్నారు. రొటీన్‌గా అనిపించే అంశాలను కూడా తీసేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.