బాలయ్య - బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ప్రకటన: స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన నటసింహం

నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో అనుకున్న సమయానికి విడుదల చేసే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టాలపై ఉన్న సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలు బయటకు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు.

ఈరోజు ఉదయమే 3.36 గంటలకు BB3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ప్రత్యేక పోస్టర్ ద్వారా ఇప్పుడు విడుదల తేదీని వెల్లడించారు. మే 28న గర్జన మొదలు కాబోతుందని అందులో పేర్కొంది. అంతేకాదు, ఈ పోస్టర్‌లో నందమూరి హీరో బాలకృష్ణ స్టైలిష్ లుక్‌తో దర్శనమిచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదే నెలలో అంటే మే 13న మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'తో పాటు మే 14న విక్టరీ వెంకటేష్ చేస్తోన్న 'నారప్ప' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Boyapati Srinu - Nandamuri Balakrishna Movie Release Date Announced

ఇదిలా ఉండగా, 'సింహా', 'లెజెండ్' వంటి రెండు సూపర్ డూపర్ హిట్ల తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఇందులో నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, పవర్‌ఫుల్ రైతు పాత్రలోనూ ఆయన కనిపించనున్నాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తుండగా.. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రను చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, దీనికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X