బాలయ్య - బోయపాటి మూవీ నుంచి స్పెషల్ అప్‌డేట్: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు
అప్పట్లో విజయ పరంపరతో సత్తా చాటి తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడాయన. ఇందుకోసం తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిశాడు. బాలయ్య కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుండడంతో.. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన రిలీజ్ డేట్లు ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో రూపొందే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈరోజు అంటే జనవరి 31 మధ్యాహ్నం 3.36 నిమిషాలకు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు అందులో పేర్కొంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. పవర్‌ఫుల్ రైతు పాత్రలోనూ ఆయన నటిస్తున్నాడని టీజర్‌ను చూసిన తర్వాత అర్థం అయింది. ఇక, ఇందులో హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం కూడా నటిస్తుందని అంటున్నారు. అలాగే, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి మెయిన్ విలన్‌గా, తెలుగు హీరో శ్రీకాంత్ మరో ప్రతినాయకుడిగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. హిట్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











