రామ్, బాలకృష్ణ, అల్లు అర్జున్ తరువాత బోయపాటి లిస్టులో మరో తమిళ్ హీరో.. క్లారిటీ ఇచ్చేశారుగా!
అఖండ సినిమాతో మరోసారి భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను తదుపరి సినిమాను రామ్ పోతినేని తో చేయనున్నట్లుగా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అఖండ విజయంతో బోయపాటి స్థాయి మరోసారి అమాంతంగా పెరిగిపోయింది. అతనితో సినిమాలు చేసేందుకు అగ్ర హీరోలు కూడా ప్రస్తుతం రెడీగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది హీరోలను లిస్ట్ లో పెట్టుకున్న బోయపాటి ఇటీవల ఒక ఈవెంట్లో తమిళ హీరో తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా వివరణ ఇచ్చేశాడు.

అఖండ కంటే ముందు డిజాస్టర్స్
బోయపాటి శ్రీను అఖండ సినిమా కంటే ముందు వరకు వరుస అపజయాలతో కాస్త సతమతమైన విషయం తెలిసిందే. సరైనోడు సినిమా తర్వాత జయ జానకి నాయక అలాగే వినయ విధేయ రామ అనే సినిమాలను చేసిన బోయపాటి ఊహించని విధంగా అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ అయితే అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడం విశేషం.

రెమ్యునరేషన్ త్యాగం చేసి..
ఇక మొత్తానికి అఖండ సినిమాతో బోయపాటి శ్రీను ఫామ్ లోకి వచ్చేసాడు. ఈ సినిమా కోసం తన పారితోషికాన్ని కూడా లెక్క చేయలేదు. తనకు ఒక్క రూపాయి ఇవ్వకండి అంటూ సినిమా సక్సెస్ అయిన తర్వాతనే లెక్క చూసుకుందాము అంటూ ఈ సినిమాకు భారీ స్థాయిలో అనుకున్నట్లే తెరకెక్కించాడు. ఒక విధంగా బోయపాటికి అనుకున్న రెమ్యునరేషన్ కంటే సినిమాకు వచ్చిన ప్రాఫిట్స్ అనంతరం ఎక్కువ వాటా దక్కినట్లు సమాచారం.

లిస్టులో ముగ్గురు హీరోలు
ఇక ప్రస్తుతం బోయపాటి లిస్టులో అయితే ముగ్గురు హీరోలు దాదాపు ఫిక్స్ అయ్యారు. ఇటీవల రామ్ పోతినేని తో ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చాడు. అంతేకాకుండా అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా చెప్పి బాలయ్యతో మరోసారి వర్క్ చేయబోతున్నట్లు వివరణ ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్ తో కూడా మరొకసారి పని చేయాల్సి ఉంది అని కుదిరితే అఖండ సీక్వెల్ లో అల్లు అర్జున్ నటించే ఛాన్స్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చాడు.

సూర్యతో కూడా..
ఇక రీసెంట్ గా ఒక తమిళ హీరోతో కూడా సినిమా చేయాలని అనుకుంటున్నట్లు బోయపాటి తన మనసులో మాటను ఓపెన్ గా చెప్పేశాడు. కేవలం మంచి బయోపిక్ సినిమాలు మాత్రమే కాకుండా మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాలను కూడా చేయడానికి సూర్య ఎప్పుడు ముందుంటాడు. ఇక బోయపాటి ఇటీవల సూర్య ఈటీ సినిమా తెలుగు రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ఆయన తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
Recommended Video

స్టేజ్ పైనే క్లారిటీ ఇచ్చేశాడు.
ఇద్దరికీ మంచి సమయం కుదిరినప్పుడు తప్పకుండా ఒక మాస్ సినిమా చేస్తామని బోయపాటి స్టేజీపైన క్లారిటీ ఇచ్చేశాడు. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే మాత్రం తప్పకుండా బాక్సాఫీసు వద్ద ఒక సరికొత్త సెన్సేషన్ క్రియేట్ అవుతుంది అని చెప్పవచ్చు. బోయపాటి తో సినిమా చేయాలని సూర్య కూడా అనుకుంటున్నట్లు అర్థమైంది. మరి వీరి కాంబినేషన్ ఎప్పుడు తిరిగి వస్తుందో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











