Boyapati- Chiranjeevi: అఖండ ను మించేలా చిరంజీవితో సినిమా.. బోయపాటి ప్లాన్ వేరే లెవల్..

Boyapati - Chiranjeevi: టాలీవుడ్‌లో మాస్ దర్శకుల జాబితాలో మొదటిగా వినిపించే పేరు బోయపాటి శ్రీను. లాజిక్‌లను పక్కనపెట్టి, హీరో ఇమేజ్, పవర్‌ఫుల్ ఎలివేషన్లు, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కించడంతో ఆయన దిట్ట. మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే దర్శకుడిగా బోయపాటి తనదైన మార్క్‌ను సెట్ చేసుకున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన 'అఖండ 2: తాండవం' విడుదలై మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంటున్నా, బోయపాటి బ్రాండ్ మాస్ ఆడియెన్స్‌లో ఇంకా చర్చనీయాంశం. ఈ క్రమంలో బోయపాటి - చిరంజీవి కాంబినేషన్ హట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

బోయపాటి శ్రీను తన కెరీర్‌లో రవితేజ, వెంకటేష్, బాలకృష్ణ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, బెల్లంకొండ శ్రీనివాస్, రామ్ పోతినేని వంటి హీరోలతో సినిమాలు చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు. దీనిపై బోయపాటి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవి గారితో సినిమా చేయడానికి ఇప్పటివరకు అవకాశం రాలేదు. ఒకవేళ అవకాశం వచ్చినా, ఆయన ఇమేజ్‌కు తగ్గ కథ నా దగ్గర ఉండాలి. ఇప్పటివరకు అలాంటి కథ రెడీ కాలేదు'అని ఆయన తెలిపారు.

Boyapati Srinu Opens Up on Chiranjeevi Movie

అఖండ సూపర్ సక్సెస్ తర్వాత బోయపాటి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆయన మాటల్లో చెప్పాలంటే.. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా అంటే అఖండ స్థాయిలో ఉండే కథే కావాలి. అంతకంటే తక్కువ స్థాయి సబ్జెక్ట్‌తో ఆయనను అప్రోచ్ చేయలేను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అఖండకు ముందు చిరంజీవికి సూట్ అయ్యే కొన్ని కథలు తన దగ్గర ఉన్నాయని, కానీ, ఆ సమయంలో ఛాన్స్ రాలేదని బోయపాటి చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం మెగాస్టార్‌తో సినిమా చేయాలంటే.. అఖండను మించే రేంజ్‌లో ఉండాలనే ఫిక్స్ అయిపోయారు.

బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్ ఎందుకు అంత స్ట్రాంగ్ అనే విషయంపై కూడా దర్శకుడు ఓపెన్‌గా మాట్లాడారు. 'నా దర్శకత్వంలో సినిమా అంటే బాలయ్య గారు కథ కూడా వినరు. క్యారెక్టర్ ఎలా ఉంటుంది చెప్పండి. నేను చేస్తాను అంటారు. అది నాపై ఆయనకు ఉన్న నమ్మకం' అని బోయపాటి అన్నారు. ఇదే నమ్మకంతోనే సింహా, లెజెండ్, అఖండ వంటి భారీ హిట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

ఇదిలా ఉంటే.. బోయపాటి తన కథల విషయంలో ఇతరుల జడ్జ్‌మెంట్‌ను అసలు ఇన్వాల్వ్ చేయరని మరోసారి స్పష్టం చేశారు.'సరైనోడు' మూవీ సమయంలో కూడా అల్లు అరవింద్‌కు పూర్తి కథ చెప్పలేదని, షూటింగ్ మధ్యలో రషెస్ కూడా చూపించలేదని తెలిపారు. 'మధ్యలో కొన్ని సీన్లు చూసి మొత్తం సినిమాను జడ్జ్ చేయలేం. అందుకే ఫైనల్ ఎడిట్ అయ్యాకే చూపించాను' అని ఆయన చెప్పారు.

ఇండస్ట్రీలో చాలాకాలంగా ఒక టాక్ ఉంది. బోయపాటి శ్రీను స్టైల్ నందమూరి బాలకృష్ణకే సూట్ అవుతుంది. ఇతర స్టార్ హీరోలతో చేసిన సినిమాల్లో ఎక్కువగా డిజాస్టర్లు ఎదురయ్యాయన్నది వాస్తవం. భద్ర, తులసి, సరైనోడు తప్ప మిగతా హీరోలతో చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవితో చేస్తే ఈ లెక్కలన్నీ మారిపోతాయి. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ లెవల్, పాత్ర స్వభావం బోయపాటి మార్క్ ఓవర్ బిల్డ్ సీన్స్‌కు కొత్త డైమెన్షన్ ఇవ్వగలవని అనుకుంటున్నారు.

ప్రస్తుతం చిరంజీవి అనీల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే బోయపాటి సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. బోయపాటి - చిరంజీవి కాంబినేషన్ వర్కౌట్ అయితే అది కేవలం మరో సినిమా కాదు. అఖండను మించే మాస్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిజంగా సెట్స్‌పైకి వస్తుందా? బోయపాటి మార్క్ మాస్‌ను మెగాస్టార్ ఎలా మరో స్థాయికి తీసుకెళ్తాడన్నదే వేరే లెవల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X