BoyapatiRapo First Thunder: ఊర మాస్ జాతరలో స్టన్ అయ్యేలా రామ్.. ఫస్ట్ థండర్ లోనే నరాలు కట్!

కేవలం లవ్ స్టోరీ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు మాత్రమే కాకుండా మంచి మాస్ సినిమాలు కూడా చేయగలడు అని రామ్ పోతినేని విస్మార్ట్ శంకర్ సినిమాతోనే నిరూపించాడు. అతనిలో మంచి మాస్ హీరో అని ఆ ఒక సినిమా ద్వారానే కాదు ఇప్పుడు రాబోయే సినిమాలతో కూడా రుజువు కానుంది. ముఖ్యంగా బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ థండర్ అంటూ ఒక వీడియోను విడుదల చేశారు.. ఇక ఆ వీడియో వివరాల్లోకి వెళితే..

అప్పటి నుంచి పెరుగుతున్న అంచనాలు: రామ్ పోతీనేని చివరగా చేసిన ది వారియర్ సినిమా ఓ వర్గం కమర్షియల్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. కానీ రామ్ ఆ సినిమా రిజల్ట్ విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఇక ఈసారి బోయపాటి శ్రీను సినిమాతో మాత్రం బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యేలా రెడీ అవుతున్నట్లు అర్ధమవుతోంది. ఈ కాంబినేషన్ ను అధికారికంగా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు అమాంతంగా పెరిగొపోయాయి.

 BoyapatiRapo First Thunder

రామ్ తో ఫస్ట్ థండర్: ఇక మాస్ యాక్షన్ చిత్రాలను తనదైన శైలిలో తెరపైకి తీసుకువచ్చే దర్శకుడు బోయపాటి చివరగా సినిమాతో బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించాడు. ఇక ఇప్పుడు రామ్ పోతినేని తో ఎలాంటి సినిమా చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ థండర్ ఒక వీడియోను విడుదల చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 BoyapatiRapo First Thunder

దున్నపోతుతో రామ్ ఊర మాస్: రామ్ పోతినే నెవ్వర్ బిఫోర్ అనేలా కాస్త దిట్టంగా కనిపిస్తున్నాడు. ఫిట్నెస్ లో చాలా మార్పులు చేసినట్లుగా అర్థం అవుతుంది. కాస్త లావుగా ఉన్నప్పటికీ కూడా లుక్ మాత్రం లోకల్ బాయ్ తరహాలో ఉంది అని అనిపిస్తుంది. ఇక ఊరమాస్ లో ఉండే కుర్రాడు పవర్ఫుల్ విలన్స్ ను ఎలా ఎదిరించాడు అని అంశంతోనే ఈ సినిమా తెరపైకి రాబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక రామ్ ఎక్కువగా దున్నపోతును హైలైట్ చేస్తూ కనిపిస్తూ ఉండడంతో ఇది సినిమాలో హైలైట్ అయ్యేలా ఉంది అనిపిస్తోంది.

 BoyapatiRapo First Thunder:

నా బొంగులో లిమిట్స్: అలాగే రామ్ ఇందులో చెప్పిన డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. "నీ స్టేట్ డాటాలెనన్నవ్ దాటా, నీ గేట్ డాటాలెనన్నవ్ దాటా ... నీ పవర్ దాటాలెనన్నవ్ దాటా ... ఇంకెంటి దాటేది నా బొంగులో లిమిట్స్ ..." అంటూ రామ్ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. చూస్తుంటే థియేటర్స్ లో పక్కా విజిల్స్ పడటం కాయంగా కనిపిస్తోంది.

 BoyapatiRapo First Thunder:

ఈసారి కూడా ఇచ్చి పడేశాడు: ఇక బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కూడా అద్భుతంగా సెట్టయ్యింది. RAPO శ్లోకంతో అదనపు ఉరుములను జోడించాడు. థమన్ ఈసారి కూడా ఇచ్చి పడేశాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. బోయపాటి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల చేస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత సాంకేతికతలతో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ద్వారా భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫైనల్ కానీ ఈ చిత్రం దసరాలో పాన్ ఇండియా లెవల్లో అక్టోబర్ 20న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X