వాళ్ళు ముగ్గురూ టెన్షన్ పడుతున్నారు కానీ.. హీరో మాత్రం! బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

RX100 సినిమాతో యూత్ ఆడియన్స్‌లో సూపర్ క్రేజ్ సంపాదించిన కార్తికేయ తాజా సినిమా గుణ 369. ఆగస్టు 2 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో నిన్న (సోమవారం) ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరై సందడి చేశారు. ఇక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బోయపాటి శ్రీను మాటలు అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నాయి. తన శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం కాబోతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు బోయపాటి.

ఈ సందర్బంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల పై ప్రశంసల వర్షం కురించారు. గుణ 369 సినిమా తాను చూశానని, అర్జున్ జంధ్యాల టేకింగ్ ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు బోయపాటి. అతను భవిష్యత్ లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని ఆయన కితాబిచ్చారు. ఇక సినిమా గురించి హీరోయిన్ అనఘా, అర్జున్ జంధ్యాల, ప్రొడక్షన్ టీం ముగ్గురూ బాగా టెన్షన్ పడుతున్నారని, కేవలం హీరో కార్తికేయ మాత్రం అస్సలు టెన్షన్ పడటం లేదని అన్నాడు బోయపాటి. ఆ టెన్షన్‌కి కారణం వాళ్ళకిది మొదటి సినిమా, అదే కార్తికేయకు రెండో సినిమా అని చెప్పి అక్కడున్న వారందరి ముఖంలో నవ్వు తెప్పించారు బోయపాటి. స్నేహితుల్లాంటి నిర్మాతలతో కలిసి అర్జున్ జంధ్యాల ఓ సూపర్ మూవీ రూపొందించాడు అని బోయపాటి చెప్పాడు. హీరో హీరోయిన్, టెక్నీషన్స్ అందరిపై ప్రశంసలు గుప్పించి కార్యక్రమంలో సందడి వాతావరణం క్రియేట్ చేశాడు బోయపాటి శ్రీను.

Boyapati Srinu speech In Guna 369 Pre release event

కార్తికేయ కెరీర్‌లో మూడో ప్రాజెక్టుగా వస్తోంది 'గుణ 369'. చిత్రంలో కార్తికేయ సరసన అనఘా హీరోయిన్‌గా నటించింది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X