బాలకృష్ణ కెరీర్‌లోనే తొలిసారి ఇలా: ఆ ఒక్క సీన్ కోసమే రూ. 2 కోట్లు ఖర్చు చేస్తున్నారు

కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడాయన. ఇందుకోసం గతంలో తనకు 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్లను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. ఈ సినిమాతో హిట్ కొట్టడంతో పాటు హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తున్నాడు. అందుకే దీని కోసం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే BB3 గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ పరిచయ సన్నివేశం అదిరిపోయేలా డిజైన్ చేస్తున్నాడట బోయపాటి శ్రీను. ఈ ఒక్క సీన్ కోసమే దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. నటసింహా కెరీర్‌లోనే తొలిసారి ఈ తరహా సన్నివేశాన్ని చూపించబోతున్నారట. ఇది కచ్చితంగా నందమూరి అభిమానులకు గూస్‌బమ్స్ తెప్పించేదిగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, పవర్‌ఫుల్ రైతు పాత్రలోనూ ఆయన కనిపించనున్నాడు.

 Boyapati Srinu Spent Huge 2 CRORES for Balakrishna Introduction Scene

మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తుండగా.. సామ్నా ఖాసీం అలియాస్ పూర్ణ మరో లీడ్‌గా చేస్తోంది. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కీలక పాత్రను పోషిస్తుండగా.. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. థమన్ సంగీతం సమకూర్చుతోన్న ఈ చిత్రం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X