మెగా క్యాంప్‌లో కలవరం.. టెన్షన్‌లో బోయపాటి.. యుద్ద ప్రాతిపదికన వినయ విధేయ రామ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్రెసివ్ అండ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అంటే ఊరమాస్ అనే విషయం అర్ధమైంది. అంచనాలకు తగినట్టుగానే టీజర్, ట్రైలర్‌లో మాస్ ఎలిమెంట్స్‌ను చూపించి ఫ్యాన్స్‌ను డైలామాలో పడేశాడు. ప్రీ రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చెప్పిన విషయాన్ని బట్టి వినయ విధేయ రామ మరో గ్యాంగ్ లీడర్ అనే మాట వినిపించింది. అయితే ట్రైలర్‌లో వినయ విధేయ రాముడ్ని ఆశించిన ప్రేక్షకుడికి విధ్వంస రాముడు కనిపించేసరికి ముచ్చెటమలు పట్టాయి. దాంతో ఈ సినిమాపై తప్పుడు సంకేతాలు పోతుండటంతో బోయపాటి శ్రీను ప్రచార చిత్రాలను మార్చి వేసినట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

కేటీఆర్ వ్యాఖ్యలతో
వినయ విధేయ రామ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ.. బోయపాటి తరహా సినిమాలు నేను చూడను. ఆ జోనర్ నాకు నచ్చదు. కానీ తప్పకుండా రాంచరణ్ కోసం సినిమా చూస్తానని ముఖం మీదే చెప్పేశాడు. అలాగే వినయ, విధేయ రాముడు కనిపించలేదు. విధ్వంస రాముడే కనిపించాడు అని చురకలు అంటించాడు కేటీఆర్.
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దూరంగా ట్రైలర్
అలాగే ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ దూరంగా ఉందనే వాదన బలంగా వినిపించింది. పక్కా మాస్, యాక్షన్ సినిమా అనే ప్రచారం జరుగుతుండటంతో సినిమాను ఫ్యామిలీ సినిమాగా మార్చే పనిలో చిత్ర యూనిట్, దర్శకుడు బోయపాటి పడిపోయారు.

ఫీల్‌గుడ్ మూవీ ఫ్యాక్టర్‌తో
మెగా క్యాంప్ సూచన మేరకు ఇటీవల కాలంలో యుద్ద ప్రాతిపాదికన ఫ్యామిలీ సినిమా అనే ముద్ర వేసే కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా ముగించారు. ఫ్యామిలీతో కూడిన స్టిల్స్‌ను అర్జెంటుగా రిలీజ్ చేశారు. కియారా, రాంచరణ్ కలిసి ఉన్న రొమాంటిక్ లుక్‌ను రిలీజ్ చేశారు.

మాస్, క్లాస్‌ను ఆకట్టుకునేలా
అలాగే మాస్ ఆడియెన్స్‌ను వదులుకోవడం ఇష్టం లేక రాంచరణ్ మిషన్ గన్ పట్టుకొన్న పోస్టరును కూడా విడుదల చేశారు. ఇలా మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను బ్యాలెన్స్ చేశారు. ప్రస్తుతం రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో పండుగ సెలవుల్లో కుటుంబ సమేతంగా వచ్చి చూసే బ్రాండ్‌ను బిల్డ్ చేస్తున్నట్టు సినీవర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











