Boycott Laila: ఒకరి తప్పుకు.. నన్ను బలి చేస్తారా? విశ్వక్‌సేన్ ఎమోషనల్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన లైలా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఫిబ్రవరి 9న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. ఈ సినిమాలో 150 గొర్రెలు ఉండాలని.. కానీ లాస్ట్ సీన్‌లో నా బామ్మర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారని , కరెక్ట్‌గా లెక్కేస్తే 11 గొర్రెలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. లైలా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్‌కు దిగారు వైసీపీ అభిమానులు.

వివాదం ముదురుతుండటంతో హీరో విశ్వక్‌సేన్, నిర్మాత సాహూ గారపాటి హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాయ్‌కాట్ లైలా అంటూ 25 వేల ట్వీట్లు వేశారని విశ్వక్‌సేన్ చెప్పారు. 14వ తేదీ మార్నింగ్ లైలా మూవీ హెచ్ డీ ప్రింట్ లింక్ పెడతానని వార్నింగ్ ఇస్తున్నారని.. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నేనేం తప్పు చేశాను, 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని ఎలిమినేట్ చేసేద్దామా అని విశ్వక్‌సేన్ ప్రశ్నించారు.

BOYCOT LAILA hero vishwak sen apologizes to ysrcp activists over 30 Years Industry Prudhvi Raj comments on ys jagan at LAILA pre release event

సినిమా వాళ్లు అంటే చాలా ఈజీ టార్గెట్ అయిపోతారా అని విశ్వక్‌సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని ఇష్యూ వచ్చి మాకు అంటుకుంటుందని, అంత చులకనగా కనిపిస్తున్నామా అని విశ్వక్‌సేన్ ప్రశ్నించారు. ఆ వ్యక్తి అనుభవం అంత వయసు నాకు లేదని.. నాకు 29 ఏళ్లు మాత్రమేనని చెప్పాడు. అతను స్టేజ్‌పై ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయట ఉన్నామని విశ్వక్‌సేన్ చెప్పారు. మెగాస్టార్‌ను లోపలికి తీసుకొచ్చామ్, ఈవెంట్ కూడా అయిపోయింది.. ఇంటికెళ్లే వరకు కూడా పృథ్వీ ఏం మాట్లాడారో మాకు తెలియదని ఆయన తెలిపారు.

అతను మాట్లాడిన దానికి, సినిమాకు, మాకు ఏం సంబంధం లేదని .. 150 గొర్రెలు అన్న సీన్ ఏం పెట్టలేదని విశ్వక్‌సేన్ క్లారిటీ ఇచ్చారు. అతని మీద కోపం మా సినిమాపై చూపొద్దని .. ఎంతోమంది కష్టపడ్డారని, సినిమా రాకముందే చంపేయొద్దని ఆయన కోరారు. ఈవెంట్‌కు వచ్చే వాళ్లకి స్కూల్ ఫీజు కట్టి సంస్కారం నేర్పించలేనని.. వాళ్లు ఏం మాట్లాడతారో మా కంట్రోల్‌లో ఉండదు కదా అని విశ్వక్‌సేన్ అన్నారు. అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరాలు లేవని, ఎందుకంటే మేం అక్కడ లేమని కావాలంటే ఈవెంట్ వీడియో చూడమని ఆయన తెలిపారు.

BOYCOT LAILA hero vishwak sen apologizes to ysrcp activists over 30 Years Industry Prudhvi Raj comments on ys jagan at LAILA pre release event

కష్టపడి సినిమాను తీశామని , నాతో మీకు ఎలాంటి శత్రుత్వం లేదని నన్ను ఎందుకు ఈ వివాదంలోకి లాగుతున్నారని విశ్వక్‌సేన్ ప్రశ్నించారు. మా ఎదురుగా ఇది జరిగి ఉంటే నేను, సాహూ గారు ఆయన దగ్గరి నుంచి మైక్ లాక్కొనే వాళ్లమని చెప్పారు. తనకు సినిమా రిలీజ్ కావడం, బాగా ఆడటం ముఖ్యమని.. ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేయాలనే ఉద్దేశం తనకు లేదని విశ్వక్‌సేన్ క్లారిటీ ఇచ్చారు.

నా సినిమా అయ్యే వరకు తనకు అండగా నిలబడాలని ఆయన మీడియా ప్రతినిధులను కోరారు. నా ప్రమేయం లేకపోయినా , నా సినిమాలో నటించిన వ్యక్తి, నా సినిమా స్టేజ్‌పై ఓ వ్యక్తి మాట్లాడిన మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాలని విశ్వక్‌సేన్ చెప్పారు. నేను సారీ చెబితేనే మీరు కూల్ అవుతారు అనుకుంటే సారీ అంటూ పలుమార్లు ఆయన అన్నారు. మీరు 40 కోట్లు పెట్టి సినిమా తీస్తే దానికి బాయ్‌కాట్ అనే హ్యాష్‌ట్యాగ్ పడినప్పుడు నొప్పి తెలుస్తుందంటూ విశ్వక్‌సేన్ వ్యాఖ్యానించారు. మరి లైలా చిత్ర యూనిట్ సమాధానంతో వైసీపీ శ్రేణులు చల్లబడతాయో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X