Bachchhan Paandey బాయ్‌కాట్ చేయండి.. అక్షయ్ కుమార్ మూవీ నెటిజన్ల ఆగ్రహం

బాలీవుడ్ చిత్రం బచ్చన్ పాండే‌పై విమర్శల వెల్లువ ఎత్తుతున్నది. అక్షయ్ కుమార్, కృతిసనన్ నటించిన ఈ చిత్రం తమ మనోభావాలను దెబ్బ తీసిందని అభ్యంతరం తెలియజేస్తూ ఉత్తరాదిలోని ఓ వర్గం ఆరోపణలు చేసింది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని #BoycottBachchhanPaandey హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్లు ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బచ్చన్ పాండే కథ విషయానికి వస్తే.. పేరు మోసిన క్రిమినల్ బచ్చన్ పాండే (అక్షయ్ కుమార్)‌పై సినిమా తీయడానికి మైరా (కృతి సనన్) ప్లాన్ చేస్తుంది. బచ్చన్ పాండే ఊరికి వెళ్లి ఆమె కలుస్తుంది. ఈ చిత్రంలో బచ్చన్ పాండే ప్రియురాలు సోఫిగా జాక్వలైన్ ఫెర్నాండేజ్ నటించింది. ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మించగా, పర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించాడు.

Boycott Bachchhan Paandey: Netizens fires on Akshay Kumar movie

తమిళంలో విజయవంతమైన జిగర్తాండ, తెలుగులో సూపర్ హిట్ టాక్‌ను అందుకొన్న గద్దలకొండ గణేష్ చిత్రం ఆధారంగా బచ్చన్ పాండే తెరకెక్కింది. అయితే ఇందులో అక్షయ్ కుమార్ పోషించిన బచ్చన్ పాండే విలన్ షేడ్స్‌తో ఉంటుంది. పాండే పేరుతో ఉంటే పాత్ర ద్వారా హత్యలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంది అంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కెనడా పౌరసత్వం ఉన్న అక్షయ్ కుమార్‌ను కెనడియన్ కుమార్ అంటూ సంభోదిస్తూ వైష్ణవ్ దేవీ అమ్మవారి భజనలను రీమిక్స్ చేసి హిందువుల పరువు తీశావు. హిందుత్వవాదులు బాలీవుడ్‌కు తమ పవర్ ఏమిటో చూపించాలి అంటూ ట్విట్టర్‌లో పోస్టు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X