twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krishna and His Leela‌పై భగ్గు.. హిందూ దేవుళ్లపై విషప్రచారం... నెట్‌ఫ్లిక్స్‌ను నిషేధించాలి

    |

    వినోద రంగ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు సినీ, బుల్లితెర ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది. కరోనా లాక్‌డౌన్‌లో సినీ పరిశ్రమ సేవలు స్తంభిస్తే ఇప్పుడు ఓటీటీ యాప్స్ వినోదాన్ని పంచడంలో కీలకంగా మారాయి. అయితే ఇటీవల కాలంలో నెటిఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ చిత్రాలు హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయనే ఆరోపణలు తలెత్తతున్నాయి.

    ఈ క్రమంలో నెటిఫ్లిక్స్‌ను నిషేధించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. #BoycottNetflix అనే హ్యాష్ ట్యాగ్‌ను దేశవ్యాప్తంగా ట్రెండ్ చేస్తూ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వివాదంలో ఇటీవల రిలీజైన కృష్ణ అండ్ హిజ్ లీలా కూడా ఉండటం గమనార్హం. ఈ వివాదంలో ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయంటే..

    అనుష్క శర్మపై మండిపాటు

    అనుష్క శర్మపై మండిపాటు

    ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన పాతాల్ లోక్, రాస్‌బరీ, డార్క్, సెక్రెడ్ గేమ్స్, లీలా, ఘౌల్, ఢిల్లీ క్రైం లాంటి హిందు మతానికి వ్యతిరేకంగా కంటెట్‌తో వచ్చాయి. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా కథలు, సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో #BoycottNetflix అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ ట్విట్టర్‌లో ప్రచారం చేస్తున్నారు. అనుష్క శర్మ రూపొందించిన చిత్రాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. ఇలాంటి కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్న నెటిఫ్లిక్స్ తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.

    నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లో హిందూ వ్యతిరేక ప్రచారం

    నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లో హిందూ వ్యతిరేక ప్రచారం

    మనమంతా నెట్‌ఫ్లిక్స్, నెట్‌ఫ్లిక్స్ ఇండియాను నిషేధించాలి. హిందూ మతానికి, హిందూ దేవతలను, హిందువుల ఆచారాలకు కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి కోవలో సెక్రెడ్ గేమ్స్, లీలా లాంటి వెబ్ సీరీస్‌లు ఉన్నాయి. అనుష్క శర్మ నిర్మించిన పాతాల్ లోక్‌తోపాటు బుల్ బుల్ సినిమాలో కృష్ణ భగవానుడిని హరామ్ జాదా అంటూ బూతులు తిట్టారు. ఇలాంటివి ఎన్నో కించపరిచే సన్నివేశాలకు నెట్‌ఫ్లిక్స్ ప్రోత్సాహం అందిస్తున్నది. కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌ను మనమంతా నిషేధించాలి అని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

    తెలుగు చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీలాపై

    తెలుగు చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీలాపై

    హిందు మతాన్ని తప్పుడు రీతిలో నిర్వచిస్తూ.. స్వేచ్ఛ, మార్కిస్టు సిద్దాంతాలను నెట్‌ఫ్లిక్స్ ప్రమోట్ చేస్తున్నది. నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి సినిమాలకు ఎక్కువగా ప్రోత్సాహం అందిస్తున్నది. ఇటీవల రిలీజైన కృష్ణ అండ్ హిస్ లీలా చిత్రం‌లో కృష్ణ భగవానుడికి అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయనే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారు. ఇలా హిందూ దేవతలనే ఎందుకు అవమానించేలా సినిమాలు తీస్తారు అనే ప్రశ్నలకు సంధించారు.

    హిందూ మతానికి వ్యతిరేకంగా

    హిందూ మతానికి వ్యతిరేకంగా


    హిందు దేవుళ్లకు వ్యతిరేకంగా సన్నివేశాలను చిత్రీకరిస్తున్న వెబ్‌సిరీస్‌లను ప్రమోట్ చేస్తున్నది. ఆ సంస్థతో నెపోటిజం, మతపరమైన విద్వేషాలు రెచ్చకొడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కరణ్ జోహర్ కూడా చేతులు కలిపాడు. అందుచేత భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను నిషేధించాలి అంటూ కొందరు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

    కృష్ణుడికి వివాహేతర సంబంధాలు

    కృష్ణుడికి వివాహేతర సంబంధాలు

    జూన్ 25వ తేదీన నెటిఫ్లిక్స్‌లో రిలీజైన కృష్ణ అండ్ హిజ్ లీలా అనే తెలుగు చిత్రం రిలీజైంది. కథనాయకుడు కృష్ణ పాత్ర అనేక మంది మహిళలతో సంబంధాలు పెట్టుకొంటాడు. ఆయన ప్రియుడి పేరు రాధా. అలాగే ఈ సినిమాలో శృంగారపరమైన సన్నివేశాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్‌ను నిషేధించాలి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

    Recommended Video

    Aha Originals : Bhanumathi Rama Krishna Teaser | ఆహాలో ‘భానుమతి రామకృష్ణ'
    భారత సంస్కృతిపై నెటిఫ్లిక్స్ కుట్రలు

    భారత సంస్కృతిపై నెటిఫ్లిక్స్ కుట్రలు

    భారత్‌తో అనేక దేశాల సంస్కృతులు, ఆచారాలను కించపరిచే విధంగా నెట్‌ఫ్లిక్స్ భారీగా ప్లాన్ చేస్తున్నది. భారతీయ సంస్కృతి, హిందూ ఆచారాలపై విష ప్రచారానన్ని చేస్తున్నది. భారతీయ సంస్కృతిని అశ్లీలంగా చూపించే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ కుట్రలను తిప్పి కొట్టడానికి నెట్‌ఫ్లిక్స్‌ను బ్యాన్ చేయాలి అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

    English summary
    #BoycottNetflix:Anti Hindu remarks on Netflix goes viral in twitter. Netizen tweete that Through Netflix, a well-planned conspiracy has been hatched to create hatred, contempt for the entire world including India about Indian culture and Hindus by showing violent Hinduism and obscene Indian culture.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X