Salaar: ప్రభాస్‌కు షాకిచ్చిన తెలుగు నటుడు.. సలార్ క్లైమాక్స్ కోసం ఊహించని విధంగా!
ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలంతా పాన్ ఇండియా స్టార్లుగా మారిపోతున్నారు. అయితే, వీళ్లందరిలో ప్రప్రథమంగా ఈ ఘనతను అందుకుంది మాత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాసే అని తెలిసిందే. అందుకే ఈ బడా హీరో వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతోన్నాడు. ఇలా ఇప్పుడు కూడా మూడు నాలుగు ప్రాజెక్టులను చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను శరవేగంగా జరుపుతున్నారు.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'సలార్' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'సలార్ పార్ట్ 1 - సీజ్‌ఫైర్' పేరిట తీసుకు రాబోతున్నారు. ఇందులో ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లతో పాటు కొందరు తెలుగు నటులు కూడా కీలక పాత్రలను చేస్తున్నారు. అందులో బ్రహ్మాజీ కూడా ఉన్నట్లు తాజాగా ఆయనే రివీల్ చేశారు.
బ్రహ్మాజీ తాజాగా ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి చెబుతూ.. 'నేను సలార్ మూవీలో నటించాను. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌కు ముందు నా పాత్ర కనిపిస్తుంది. ఇందులో గ్రే షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నాను. అది అందరికీ షాకిచ్చేలా ఉంటుంది' అని వివరించారు. అంటే ఆయన మంచిగా నటిస్తూ ప్రభాస్‌ను దెబ్బకొట్టే రోల్‌ను చేస్తున్నట్లు అర్థం అవుతోంది. దీంతో బ్రహ్మాజీ పాత్రపై ఆసక్తి నెలకొంది.

ఇక, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్‌లుగా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











